Friday, March 13, 2026

 14 September 2019

 
Shared with Friends
టైమెంతైందీ, సరే చెప్తాకానీ
వింటావా, టైమెంతుందో సోచిస్తావా?
నాద్వందచిద్భూతమా సరే,
భయమయినా ఆలోచిస్తా కానీ
టైమెంతౌతోందీ., అరే చెబితే నీ
గుండె ఛప్పున చురుకైతే, నీమనసు
సంభ్రమ భ్రమణమైతే, తిరిగే కాలం
నీనూకలుచెల్లి ఒక లిప్త ఆగితే......
....నాకెమైనా మూడిందేమో, నీడే
నిలదీస్తొంది.. ఓరినీ అహం,
నీడ నీదే దానికి భ్రమలుండవ్ పర పీడకి
నీడ సాక్షే, కాని నిజానికి కళ్ళుండవ్
సరే టైమెంతో చెప్తా., ఒద్దొద్దు చచ్చినా
నువ్వు చెప్పొద్దు, ఎలాగూ తప్పదు
ముందో వెనుకో! నా చావు నే చస్తా!
అంటే చచ్చెదాకా ఇచ్చకాలాడతానంటావ్
నీ పుట్టకలో పరమార్ధం ద్యోతకమైతే
చావురేవు రేపైనా తొందరో తూలవ్
మారణ హోమంలో క్షుభితాత్మవి కావు.
కొంచం ఆలోచించు.మైలంటే ఋతువంటే
పూతంటే పురుడంటే శమనమంటే
దమనమంటె రోతంటే వాసావాస
వాసనలంటె నమ్మినా
నమ్మకపోయినా వెంటుండేవే.

No comments:

Post a Comment