yanarayana Charyulu Maringanti updated his status.
వుషసున తొలగు మాయ కడు
నలుపది తెలుపున వెలుగు
జీవి ఒడితడుపబడికలిపిన
యేడురంగుల కొలువు తెలుపు,
పంచభూతములు,జరామృత్యువులతోడి
యేడునుకలగలుపై కలుగు
చీకటిన కలసి ప్రాణబిందువై,
లింగమోజంగమో యోనియో
వ్యోమమో గ్లానియో,ప్లావమోస్రావమో,వుపకారణమే
జాత,మృత్యురూప కరాళమునకవిగొళ్ళెములు
ఆత్మ ప్రాణానుకంపనమునకవి విడువబడు వుడుపులు!
కనుగొన్న భగవద్విషయము భావాతీతమె!
మతములు,సద్యో మార్గములు,సాధనకై
సప్తవర్ణములు,తెలుపౌ సాధన వెలుగౌకద
అదితెలపిన గాంగేయుడు శుక్లాంబర ధరమని,
రామచాపమును నేలనిలపి, పాలపుంతన,
విడివడిన చాయారూపలేశముల నడయాడు,
సోమసూర్య ప్రభల వెలుగొందు పూర్ణకళాకోవిదు
విష్ణు వని, మనముననెంచి,దిక్కులె బాహువులని,
ఎక్కుడునెంచగ అవ్యములంగములని,చక్కగ మేనిని,
చిక్కని నలుపును మాయగనలమి,సహస్రాధిక
గుణములు గణ్యముగ గల హరిపూర్ణకళా
రూపమని కనులార తన ప్రాణప్రజ్వలమున కాంచి,
తనవారమౌ మనకు చూపునిచ్చె
నల్లన యన వర్ణనాతీతము,మాయ,మరి తెలియలేని మిగులు
తెలిసిమది,తెలివిడికానిది,తెలియనిది,తెలియరానిది
,జన్మ,మృత్యువులకవల,కారణ,కరణ కారకముల,
సర్వము బ్రహ్మమని,దానికాద్యంతములె
నారాయణడను పరి భావనచేసిన యాతడు
మనకాద్యుడు దైవ పరికల్పనకు,
కావున శివకేశవులంతు చిక్కని బ్రహ్మ పదార్ధములని
,బ్రహ్మజ్గ్నానమె సచ్చిదానందమని యెరుక గద!!
No comments:
Post a Comment