Dr. Krishna's telugu politico poetic debut..
మత రోతక
మసి దీపక
జన పీడక
శవమా
హాలాహల
నైదాఘ తీష్ణతలో
అనిమేషమైన గాలి,
గుడి అరుగులమీద
పులీ జూదం -
సాహెబు శవం
అది బీడి కాలిస్తే
హిందూ శవం
సిగరట్టు కాల్చునా
రావి శాశ్త్రి కధలో
పులి బ్రాండు సిగరట్టు
అమరావతీ పురిలో
పోత్రం రాయైన
బుద్ధుడి తలకట్టు
హిందూ శవం శవమే,
సాహెబు శవం పెద్ద పులిట
వీళ్ళకి పులిని చూస్తే భయం
శవం చూస్తే భయం
సైతానున్నాడేమో అని భయం
గవాక్షం లేని మసీదులోనో
గుడిలోనో, చర్చీలోనో
గమ్యం తెలీని గద్దలు
గుర్తుగా గమ్యం చెప్తే
గుడ్డిగా కొట్టుకు చస్తే,
శ్మశానంలో
శవదహనం చేసే రాబందులు
బాగా కాలుస్తా అంటూ
శవాలపై సెంటిమెంటుపై
సరదాగా బెట్టింగ్ కాస్తే
సామన్యుడు శవం,
వాడికి బ్రతుకు భయం
చావు భయం
శవ సంస్కారం
ఇంకా భయం!
మతం భయం
రోత నయం
శవం సహ్యం
మతమే అసహ్యం
Posted 40 minutes ago by Krishna
No comments:
Post a Comment