Friday, March 13, 2026

 స్మరించెదము విరించి సాక్షిగా

ప్రాణతర్పణం చేసిన రాజపుఠాణ
సోదరీమణులార,, కర చరణ మనః
కామనన, తేజోమయ దీపికలార
తమ్ములార సుగంధ కీర్తి పుత్రులార
చీకటి చీల్చి అమ్మకి ఆరతినిచ్చిన
సైనికులార నిజం నిజం మా వూపిరి
మీరే బలిమి కలిమీ నిరంతరం మీరే
యీనేల యీ గాలీ పచ్చని ప్రకృతీ
మీకవోష్ణ ధారలతో సజీవమైనది
పిరికి పందలు నిందలువైతురుగాక
చిరంజీవులేమీరు తిరంగ సాక్షిగా

No comments:

Post a Comment