·
Shared with Friends
ప్రాణమది ధగధ్ధగిత కీల
తనువై తనన కనరాని దివాకరమే
కర లేశమె జీవాంచిత తావి,
కళేబరమది వెలుగదె పెనుజ్వాలన
కళ దప్పిన బొంద చితిన చితుకె
విలంబిత ప్రాణి శోషణమొంది
పాపపుణ్య పడికట్టున తన
చితిని తను గిరికొట్టుచు
దుస్సహతాపమును మ్రింగ లేక
మనఃసహజ యాక్రోశమున
శమించుచు తను కాని తనను
తనవని తగలెట్టెడువారల
శపించునేమొ క్షమించునేమొ
విశ్వే దేవర రహస్యమె
ఓ బందుగు సందోహములార
పుత్ర పుత్రీ మిత్రావరుణులార
కాల ప్రవాహ కీలల లయము
నిశ్చయము, సంజ వార్తురో
లేక పెను'సంజ'న పంజర పంచ
కుంజర యూధము దగ్ధమౌ
నిర్వేద నిరంజనమున
గీము విడిచి పంచ జేరిన
ఇభ ఖఛ్ఛపసమాన కామ
క్రోధ సరళిన మత్తులౌదురొ!
సావధాన! సావధాన!!
అగ్ని దగ్ధ అనగ్నిధగ్ధ
ఆత్మ ఆత్మీయ స్పృహ
నిజ మనముల నిలచుగాక
No comments:
Post a Comment