నిమిదేళ్ల క్రితం ప్రపంచానుభూతి ఉక్కిరిబిక్కిరి చేసిన తరుణం. అభ్యాసానికి మనసు సుతరామూ తోడుపడని రోజులు. అహమంతా అనుక్షణమూ ఇహలోకపు స్పృహ. కానీ సమయమప్పటికే తను దాటిపోతున్నానని సంకేతాలిస్తూనే ఉంది. దాని మాట ఖాతరు చేస్తేగా. విధి తన పని తాను చేసుకుంటూ పోయింది. అవిటితనము అవ్యయమై స్థిరంగా మెదడులో తిష్ట వేసింది. బుర్ర రామ కీర్తనలో మొదటి పదమే పాడిందే పాట. ఈరోజు ఆశ్చర్యంగా ఇదికంట బడింది. చదువు కుంటే ఓర్నీ నారహస్యం నా గుప్పెట్లోనే ఉందని స్పృహ కలిగింది.. ......తను తలుచును తలపుకు ప్రేరణ తలకద
తలకు తోకలు పెక్కులు మనసు గాలికి
తగులుకు నిలవరించినిలవనీక వ్యాపనమౌ
తగుమాటను నగుబాటునుచేయు తలపులు
కొలికికి రాని వూసులు చూపుల తాపమో
రుచుల తీపరమో సంపర్కపు శ్లేష్మమో
మరి విడివడని సాలెగూటి వలలొ పురుగైన
మన తలపుల తల్లి తల క్రింది మనసు
వళ్ళంతకళ్ళయ్యే కోరికలు తలకి తప్పుడు చెవులు
ఒప్పుకోలు మనసు యెల్లప్పుడు స్పర్శ చెప్పుచేతలవలన
సజీవ సమాధి మరి ఆత్మ బంధిత మతి గతి
లేక తల తలపులనుంచి అప్పుడప్పుడు తొంగి చూడనేర్వదె అప్పుడప్పుడా
చూడ్కుల నెగడునబడి
కనబడు
విషయ వస్తువుల క్షణిక కణముల తొణికి జారదె
కాపోయిననూ కాలగతిన కరగదె
బ్రతుకే చివరికిమిగు లునదేమికాదుగద
మరి మెదడుకుమోకాలుముడి ఎక్కడ!
పిడిరాయివలె తినితిరిగెడిమనుజుడు దేనినోవెతుకును
అది సర్వం ఖల్విదం బ్రహ్మం కాపోయిన కాపురుషుడౌ
మరల మరల జన్మ జరా ధుఃఖి తుడౌ
కాని తలలో చేరిన రిమ్మ తెగులు వ్యసనము
అది వాహకము వైవాహికము
అదీ తులనాత్మకత ఎంచని కోరిక
అది అభావము స్వభావమూ
అది ఇది కడగనిది, నిధియై వ్యధయౌను
మతిలయల శ్రుతిలేక గతి చెడుగౌను
ఆత్మ ద్రిగ్గుళ్ళి మౌని యగును
త్రుప్తి పరకాయాన్వేషితమై
అసంత్రుప్తమౌను మరియు అనుషంగికమౌను
ఆత్మతో అపరోక్షానుభూతి పొందిన
శంక భగవత్పాదుల శృతి స్మృతి చేకొన్న
సచ్చిదానందభావుకత తల కెక్కదె
తల పండి తలపులు తెరచిన మనసున
ఆత్మ సంగత మౌను సంగతులెల్ల
అభావ సుద్ధ బ్రహ్మ మౌను
మనిషికి మెలకువ నిద్ర యొక్కటౌను
అనగ తలపులు తలుపు చాటు చేయవు.
No comments:
Post a Comment