సింధులో వెలసినా ఓ నాటి స్వప్నమా... నా వారి ఘనతను నినదించు నాదమా .... చరణాలు తెగినట్టి పాటలా రాలావే... ఈ నేల పొరలలో చరితవై మిగిలావే..... హే దివ్య సింధు విశ్వజన బంధు నీ కీర్తి కౌముదులు పర్వుదిశలందు”....
ఎంత చల్లనిదీ గాలి పాట !మన
సంత పల్లవించెనాత్మబందుగులార తల్లిగోస
వింతయె, తలి తండ్రుల తొల్లిటి జాడ
నింగి నేలను గరచిన సంజ వేళనూహింప!
సింధువె బిందువై, అందమె సంద్రమైన వేళ,
కాల వీచిక చల్లనైనతరి పుడమిన పొటమరించె,
యది సింధు నద నాగరిక ప్రవాహి అయ్యది
తొలి నాగరికతయె,ఘోరకలినంబడి పెను
కాటకంబున నద్దాని వెలుగులంతరించిన తరి,
మలి కాలపు నాగరికుల వెతకబోవని సిరి,
హరికాదు, హరుడె తొల్లిటి విభుడనంగ-
గంగకాదు, తొల్లిటి పావని సింధువయొ-యని
యవనిన సింధు సైకత లింగమె తండ్రియని-
అమ్మ తల్లి ధరాధరి యని యరుకైనదిగ,- ఓ
సకల లోక జనులార గతము మన కలనైన
అవగతమొనరించి అంతకాలమెంచి
పంచ భూతములనుగాచు కొందము గాక!!
No comments:
Post a Comment