Friday, March 13, 2026

 అనుభవిస్తున్న సుఖధుఃఖాలూ ఘర్షణ ప్రతిఘర్షణ ద్వయము. వ్యయముచెందే జీవనము గడచిపోతున్న ఋణానుబంధము. ప్రయాణము పూర్తి కాకుండా గమ్యము చేరము. గమనము తడబడకుండా సాగే అదృష్టము గురుకృప లక్ష్యలక్షణ అవగాహన కలిగిస్ధాయి. చింతన ఎందుకు జన్మించాను ఎందుకుజీవించాలి ఎలాజీవించాలి నామార్గమిది నా గమ్యమిది నాసంచితమిది నేవిముక్తము చెందవలసినది దీని నుండి, నాకు మిత్రులువీరు, నాకు శతృత్వమాపాదన చేయుసృంఖలి లివి...ఇంతమటుకే భావగోచరమయ్యే జవాబు పొందగల్గిన ప్రశ్నలు. మానస సరోవరము నిష్కల్మషమైనప్పుడు శరీరవశము అత్యంత సులభమనీ, మనోబుద్ది వికారములడగితే తేజఃపుంజ పటలము సద్యోమార్గ దర్శన చేయిస్తుందని మన ఋషులు అంటే మన ప్రవరకు తొల్లింటి వారు ఆచరించి మూలగురువులైనారు. మన మనః ప్రచోదనమే భగత్ప్రాసాద భాగ్యము. భగవంతుడుఐబాధలు పెట్టడు తీర్చడు! తీర్చుకునేయీక్తాయుక్తత పుట్టుకతో ఇచ్చి తొలి మలిగురువులతో కట్టడి చేశాడు! అమ్మని నాన్నని వారి పుర్వాచార్యులనీ మనము ముక్కోటి దేవతల భావన చెసెక్రమంలో అమృతత్వము సిధ్ధిస్తుంది!!

No comments:

Post a Comment