మన మాటలు మనకే కాదు సభ్య మానవ సమాజానికి వెలుగు బాటలు కావలె. వెలుగో జిలుగో లేకపోయినా మనస్సు కలుక్కు మనే భాష సమ సామాజికం కాదు,సభ్యమూ కాదు.ఇక్కడ పుట్టి పెరిగే కోట్ల జనాభా పూర్వాపరాలు ఇక్కడవే. ముస్లిం అయినా,క్రైస్తవుడైనా ముక్కు మొహమూ వంట్లో చీము నెత్తురు ఒక మట్టి గడ్డలో పుట్టి పెల్లుబికిన మనోజీవ బుద్యాత్మ రూపాలే. రామాయణము, భారతము, ఋక్కులూ శృతి స్మృతులూ మనకు సభ్యతా సంస్కార గోచరతా ఇచ్చాయి. అద్దంలో అన్నదమ్ముల రూపాలే మనం. వీడు బాపన, వాడు మాల, మరొకడు సాయబు ఇంకొకడు క్రైస్తవుడు అనే తేడా కోసిచూసినా కనబడదు భగవత్ సృష్టిలో. వేరే దారుల్లో తెలిసి తెలీక జీవిత పోరాటం చేసుకునే కామ్య జీవులే. దుర్మార్గాన్ని పరిహారిచేవే మాటల దారులు. మత సర్పంతో మాట్లాడితే మళ్లీ మళ్లీ క్షీర సాగర మధనమే మొదలవుతుంది. కామ్యక క్రోధొ మదంతో మాట్లాడితే కురుపందవ యుద్ధమౌతుంది. అందుకనే గీతా శాతం ధనాన్ని సౌర్యాన్ని,కర్మనీ, కార్య దీక్షనీ మాటమాటలోనూ అద్ది మనకు బుద్ధి ప్రసాదాన్నిస్తుంది.
No comments:
Post a Comment