Saturday, September 5, 2015

Wednesday, 24 April 2013 at 11:43 UTC+05:30



.
తల్లి తండ్రులారా ముళ్ళకంచె పై బట్టలారేసుకున్నారా?
అయితే జాగర్త,చేతులు కాలతాయి. బట్ట సంగతి దేముడెరుగు
,ఆకులు దొరకవు. బొబ్బలు తగ్గినా ముళ్ళు పడితె వూడవు.
తెగలాగితే తాడు తెగేను,జాగ్రత. చదువు చెప్పించారా,కొన్నారా?
అదేదో తెలీకుందానే పిల్లలు, పెద్దయిపొయీ దిక్కులేలుతున్నారా>
భయపడకండి,పైన దేముడున్నాడు. మంచయినా చెదయినా వాడొకడు
, ఆనక పనికొస్తాడు,మీకైనా మీ పిల్లకయినా "విధి బలీయమ"ని
అనుకోడానికీ,లేదా వెధవది కర్మ మీ వల్లే కాలిందనుకోడానికి.
మనసు మాసిన బట్టైతే,వంటిని వుతక్కూడదుగా
,గుడ్డ చిరిగితే బట్టకట్టలేముగా,బతుకూ అలాంటిదే.
అర్ధమైందా తమ్ముళ్ళూ,చెళ్ళెళ్ళూ.


.
పాలు నేలపాలైతే? వంటికి దెబ్బతగిలితే
జలుబో,జ్వరమో వస్తే డబ్బులు పోగొట్టుకొంటే
పరీక్షలు తప్పితే చివుక్కు మంటుంది మనసుకు.
అవునా! మనసుకే దెబ్బ తగిలితే?
రీరం అవస్తలు తప్పుతుంది. తినబుద్దేయదు
,పరి పరి విధాలై పరితపించిపోతుంది.
నేలపాలైన పాలూ,చెదిరిన మనసూ,
సరిపెట్టుకోలేని బాధని కలిగిస్తాయి.
మనసంటూ వుంటుంది,మానుకూ
అమాయకులకి కూడా.అది
మానవత్వానికున్న వరమే.
పసువులకన్న,పక్షులకన్నా
మిన్నగా జ్ఞానమనె వెన్న
విచక్షణ అనే బుద్ది కల గలుపైతే
అతీతమది కామ క్రోధాలకి
గమ్య మది మరోప్రపంచానికి.

No comments:

Post a Comment