నేను భ్రమరాన్ని కానీ
.
నేను భ్రమరాన్ని కానీ నా కీటక స్వభావము మారదేమి?
పసిరికనంతా బక్షించీ గూడుకట్టుకు మునినైపోయా
మౌనంలో ఎన్నోమారులు ధ్యానం తప్పి ఎమారిపోయా,
అమరమౌదామనుకున్నా,కానీ కీటకాన్ని కదా బ్రమరమయ్యా.
ఎంత తిందామన్నా నోరుపట్టదే?
ఎగిరెగిరి ఎన్ని పూలని స్పర్సించానో.
స్పర్శాజాత మహత్యమో ఎమో, మకరందమే,
నా అహారమూ,రాలిపోయే పూల రెక్కలే
నా ఆహార్యమూ,అయ్యాయి.
కోరికలేముంటాయి,నే తలవకుండానే
భ్రమణంలోకి జారి,నామూలాల రూపాలు
చూసి నిస్చేస్టితమై, నాజీవితమే భ్రమరకీటక న్యాయమనీ
రూపమూ,స్మృతీ, నిత్యమూ,మృతి చెందేవేనని తెలిసీ,
మరోజన్మకి మళ్ళీ సిద్దమయ్యాను..
No comments:
Post a Comment