Tuesday, September 8, 2015

Tuesday, 22 April 2014 at 23:03 UTC+05:30

పట్టిన ఉగ్గు పాలు



పట్టిన ఉగ్గు పాలు
మనకి పట్టిచ్చిన జాడలు తక్కువ.
శంకర భగవద్పాదులు ఇచ్చిరి
సుందర నారద భక్తి మంజరి
శారద దయాంచిత చూడామణి
జ్ఞాన ప్రసూన సదసద్వివేక వర్ధిని
. భగద్రామానుజులు వార్చిరి
నవజాత ప్రాపద్భక్తి రస ఝురి.
ఇష్టకామ్య గ్రహ గ్రహణాదులు
నష్టకాలము దెచ్చినప్పుడెల్ల
మనోజ్ఞ సుధా రేకలు కానమైతిమి.
భక్తి జ్ఞాన వైరాగ్యములు చిత్తుగ
నూకలు చెల్లించుటకు కాదు తమ్ముడ,
ఒక ప్రతాపుడు,ఒక శివాజి ఒక నౌరోజి,
తిలకు బోసు,గాంధి,రాధాక్రిష్ణ కేశవ
మాధవ సదాశివులెల్ల నీయశోగాములు
, వారెల్ల భాగవతులె,జ్ఞాన తప్త వీరకిసోరములు.
వారె మన దిశా నిర్దేశకులు,
సేవా విధులెల్ల వండి వార్చినారు.
తల దించి నేలను చూసినడ నెంచు.
కల యందు జీవ భౌతికములు నిజమే.
వల త్రాళ్ళు వివేకము తప్పకద్రెంచును.
ఘనులౌ పూర్వుల కనవె విష విషయముల
విపంచకమునుద్రెంచవె
.వివేకభాసురమౌ వినయశీలివి గావె.

No comments:

Post a Comment