Monday, September 7, 2015

Friday, 23 August 2013 at 06:44 UTC+05:30




జ్ఞానమంటే ఏమిటి? పది ఇంద్రియాల ద్వారా మనము ప్రపంచానికి పరిచయమై లోకాన్ని,లోకరీతులనీ తెలుసుకుంటాము. గ్రామ్య,పట్టణ,నగర ప్రజలు,వరుసగా వారి వారి నాగరీకలతో వృద్ధి చెందుతూ జీవన సాఫల్యాన్ని పొందుతారు. కాని,క్రియాత్మకము గా పనిని చేసే కొన్ని అవయవాలు, 'ఆజ్ఞాబద్దత'అనే దానిమీద మొట్టమొదటి పర్యాయము ఆధారపడినంతగా తదుపరి ఆధార పడవు, వాటి వాటికి పని జరిపించే జ్ఞానమో అగ్జానమో సంపూర్ణముగానో  వైకల్పికముగానో  సంభవిస్తుంది. ఓక్కొక్కసారి  మొదలైన పని  స్వభావ తీవ్రతని బట్టి పనిని ఆయా అవయవాలు, క్రిందిస్తాయి బుద్ధి వ్యవస్తా ఆపలేదు. కారణము, బుద్ధిలో నిబిడమై స్తిరమైపోయి పాదుకొన్న తామస రాజస,సాత్విక  గుణములని భావిస్తారు. అందుకనే మనో ప్రచోదనానికి పరివర్తనకి సంబంధించిన బ్రహ్మాండమయిన ప్రయత్నాన్నే మనము యోగవిద్య,బ్రహ్మ విద్య,ధ్యాన,సమాధి,క్రియలనీ,హంసా,పరమహంసాదిక,స్తితులుగానూ,గుర్తిస్తాము. వీటన్నిటికీ తొలిపలుకు,జ్ఞానము, పలికితే,-విజ్ఞానము: పరిశీలనా పర్యావసానాలు తెలిపేది,ఇంగితజ్ఞానము. :మన విచక్షణా,శాంత,అనునయ,వినయ,సాత్వికతాది లక్షణాలు పెనవేసుకున్నదీ,పరేంగిత జ్ఞానము: మన గురించి ఏవిధమయిన శ్రద్ధా,ఆలోచనా,క్రియా శీలక కర్మా,చిత్తశుద్ధి స్వార్ధ పరార్ధత ప్రయోగిత శీలురముగా వుంటామో అట్టి పరిభావన పరికల్పన ,పరికర్మ, పరిక్రియా గలిగి వుండడమనే స్వభావా శీల,ఆచరణాదిక  'ప్రవర్తన' స్తిరీకృతమయిన స్తితి- కలిగిస్తుంది గురు కృప మాతృక్రుపా,సంచితజ్ఞానమూ,రాజ్య శిక్షణ,దైవ సంకల్పమూ,మాత్రమే,ఇంగిత పరేంగిత జ్ఞానాల సంపూర్ణ వికాసానికి ఆద్యంతాలవుతాయి. అందుకనే,మన తలి తండ్రులు,మన విద్యావ్యవస్తా,మన రాజ్యవ్యవస్తా మన్ని ప్రభావితము చేసి,జీవితాన్ని దిద్దుతాయంటారు. మన మెన్నుకున్న రాజ్యాంగాన్ని,మన నాయకులు పరి రక్షించాలనీ,ఆనాయకులని,ప్రలోభము లెకుండా మనమెన్నుకోవాలనీ,పనిని,కాలాన్ని ద్వంసము చేసే అధికారము చేతిలోకి తీసుకోవడము సమాజానికి మృత్యుప్రదమనీ ప్రజలు, విద్యార్ధులు,వుద్యోగులూ,గురు వృత్తిలో వున్న వారూ,పూజారులూ,తెలుసుకోవాలి. దొంగల గురించి,బిచ్చగాళ్ళ గురించి,పతితలగురించీ,మనము నాగరీకముగా గాని,అనాగరీకముగా గాని మనము ఏవిధముగా దండనాధికారాన్ని చేతిలోకి తీసుకోకూడదో,అట్లే సువ్యవస్తిత చట్టవిషయాల నిర్దయక నిర్దేశిక అధికారాలను చేతిలోకి తీసుకొనడము డాక్టర్ అంబేడ్కర్ గానీ,పనిక్కరు మహాశయుడు కానీ,అనంతశయనము అయ్యంగారు గారు కానీ,బాబూ రాజేంద్ర ప్రసాదు కానీ వూహించి వుండరు.

No comments:

Post a Comment