ఆషాడశ్య ప్రధమ దివసే....
మేఘ సందేశము గుర్తుకు వచ్చి
గోషామహలు గోడలు చెమ్మగిల్లినై
ఎన్నో వర్షాకాలాలొచ్చి వెళ్ళాయి
కానీ నా వంటి మైల కరగదేలా?
భాగ్యనగరి మాన్యత నేనుకాదూ,
వీళ్ళకి స్వాతంత్రము వచ్చింది సరే,
అయినా అదే మనుష్యులు
అల్లానే మురికి చేస్తున్నారు,
నా నున్నని మేనిపై ఇంకా ఎర్రని వుమ్మి
వేస్తూనే వున్నారు నా కళ్ళు
క్రూర కర్మలని చూస్తూనే వున్నాయి.
నాచెవులు ఎన్నో కుతంత్రాలని వింటున్నాయి,
కానీ నావెనుకే వున్న కర్మచారులు,
నన్ను దాటుకెళ్ళే పదచారులూ,
నాపై వుమ్మి వేసే దురాచారులూ,
తమలో దాగొన్న పిచ్చిపట్టిన సునకాలనీ
ఇస్టా విహారముచేస్తున్న స్విర మూకల్నీ
చూడరేమి. నా కళ్ళూ చెవులూ
ఇంకా జీవించివున్నా సున్నాలూడినై,
ఇక ఈ ఆషాడము నాకు గడ్డుకాలమే,
ఘట్టిగా మేఘమురిమితే పడిపోతానేమో?
అయినా నాపూర్వపు భాగ్యనగరి
ఆనాటి వైభోగమూ చూడాలనేది
లోలోపలి పిచ్చి కోరిక తీరేనో లేదో,
రేపన్నది వుంటే చూస్తా,తరిస్తా
మనుషులూ నేపడిపోకముందే నాగోష
వింటారుకదూ, నా మరకలు తుడుస్తారుకదూ,!.
===============================================
మారు తాళాలున్నాయా బీరువాతెరవాలి.
ఏమీ దొరక పుచ్చుకు పారిపోయేందుకు కాదులే!
పండు పని మీద హడావుడిలో పడేసుకుందిట.
అయ్యో అత్తకివ్వలేకపోయిందా దాచిచ్చేదికదా,
దాచమని దానికిచ్చింది అత్తే, తాడుబొందులో
తంకర్లవాడుటాడు మామా, అరేయ్ బాబూ
తంకర్లవాడింటికి వద్దుకానీ, బీరువానే వాడి
వద్దకు తీసుకెళ్ళు. నాన్నా అత్త మాట విన్నావా
ఎంతైనాసరే వాడింటికొద్దు! ఆటో బాబూ,
తాడుబొందు తంకర్లవాడి కొట్టుకి కూలీ ఎంతా?
ఆయ్ బీరువాకీ మీకూ కలిపి అయిదొందలవుద్ది,
ఏవూరు బాబూ మాట మావూరిదిలావుంది
,కుంచం తగ్గిచుకో, సరేనండీ నాలుగూయాభై ఇయ్యండి
, తంకర్లా సాయిబుగారూ తాళము చెవులు పొయ్యాయి వేస్తారూ
, భేషుగ్గాభాయీ పగ్లాదియ్యాల్నా సరీ చెయ్యాల్నా,
ఏదోవకటి దబ్బుల్క్షవరంచెయ్యకుండా, సరే
డోర్కీ ఓపెన్ చేసీస్తాం మీకి ఫికర్ వద్దు
, పైసల్ దో సౌ దేనా, థీక్, సరేకానియ్యండి,
మొత్తం పనికి రెండొందలు ఖాయమేగా,
తాళమూ తలుపూ వూడి బీరువా తల్లకిందులైంది
. పైసల్తే, భాయీ, అయ్యో తలుపూడిపోయింది కదండీ
(వీడి శ్రాద్ధంపెట్టా దబ్బులూ దొబ్బి తలుపూ చెడగొట్టాడు)
సరే బాబూ, ఆటో ఈరెంటికీ కుక్కడపల్లికియెంతా?
పాంచ్ సౌ, అయ్యో అంతెందుకు ఇందాకా నాలుగూ యాభైచ్చాను.
బేరంలే, ఈరెంట్నీ వూర్కే మోస్తారేం,! (సరే తగలడు)
పట్టు తండ్రీ,ఓయ్ తండ్రీ గిండ్రీ జాంతానై, నీకి సామాన్ నువ్వే పెట్కో
,(హారి వీడి దుంపతెగా పెట్టుకోపోతే రాడేమో)., ఇంటికి వచ్చక
, నాన్న తలుపు విరగ్గొట్టేయించావేమిటి? ఎమండీ.,
ఇది తుక్కుకమ్మేయండి, (ఖర్మరా బాబూ తప్పదింక)
భాయీ తుక్కుకొట్టు పక్కనే వుంది కాస్త వస్తావా?
భలే బేవార్సె గా రావల్నేం, లేదూ ఇంకో యాభై ఇస్తా,
తుక్కబ్బాయ్ ఎంతిస్తావ్ ఈ బీరువాకి,
కేజీ ఆరు రూపాయలండీమొత్తము ఎంత?
నలభై కేగీలండీ రెండువందలనలభై సరేనా అండీ
(చచ్చినాడికి వచ్చిందే కట్నమట) బాబూ రెండువందలే వున్నాయి
తీసుకుంటారా, కానీవ్వు ఎంచేస్తాను రోజైపోయింది,
కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చాను. ఆదాయము 2 ఖర్చు 8
No comments:
Post a Comment