Monday, September 7, 2015


బొమ్మెర వారూ,కమ్మరివారూ



 బొమ్మెర వారూ,కమ్మరివారూ, 
కల హల కావ్య కళా రీతుల,
సమ్మెట పోటుల కాల ప్రతీప్తమైన
కఠిన శిలా దండనమందిన
శ్రీనాధ అపర అష్టావక్ర  
సింగారాచార్య ప్రణుతి
ప్రకటిత ప్రభావ శీలి  నాదు తెలంగాణ,
నా నీటి నానోటి నాపాటి నాసాటి
సోదరవంద్యకాదా నాతల్లి తెలివాహి
తెలుంగు తల్లి వెరొక్క చోట నోట కల్దే ?
నా చెల్లి కృష్ణ,శారద మంజీర, తమ్ము భీమ
, బిడ్డలు కాళింది,పెన్న, అమ్మ కావేరి కాద
ఓ సకల జనులార అరవింద మందార మాలల
నాబిడ్డకొల్చు శ్రీకాకుళాంధ్రడేవుని ఆన
నన్ను నన్నుగా చూడక కలత కల్గించుటేల,
కన్నుల బాస కనలేర, వంద నాల్గుల
దాస్యము కడతేరిన నన్ను
నన్నుగా గారవింప వినుతి మీకు
,నాదు నీరముల కలువల కొలువుల,
సస్యశ్యామల ధరణికోట నేలుకొనుడి
గీర్వాణాంధ్రులార,సిమ్హపురి వీరకిశోరములార,
మేలు కోటల కొండవీటి రెడ్డిదొరలార,
రోష వవేష భాషానందడెన్ద\
ఒంగోలు రంగోలు ప్రభువులార,
దేవుని గడప తిరుపతి దేవుని అంతేవాసులార,
నీరములు తీర్థమ్ములు ప్రాసాదమ్ములు మీవి;
మాకు కొసరు చాలు మమ్మరసి, మాజోలి,
మమ్ము, నిలువ విలువ కలిగి దారి తొలగుడీ.
నూలి నేల మాంచాలపాలి కరునూలు రాయలార
, మీయమ్మ జోగులాంబ మాయమ్మలకు అమ్మ
, మీపూదోట విరిసిన మాచిన్ని చెల్లి,తుంగ,
తమ్ము భద్ర మీ కుశలమరయుదురుగ,
మీకేల చింత? మీవంతు మీది కాక మా బువ్వ మా కరగదే?
, అనంత మీరంత మా ప్రభువు పద్మనాభుని కొలువాయె,
సాయి సుధావారిధి సకల శుభములు మీకు
లేక మాకు శరణు లేదుకద.
మా సంకెలలు తెగిన వేళమన్నించి
మా బాట మామాట మాకు విడువదే.

Sunday, 8 September 2013 at 12:48 UTC+05:30

No comments:

Post a Comment