Sunday, September 6, 2015

TIRUVITTAMU


Friday, 8 February 2013 at 19:58 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
KAAMAKOTI PEETA PRASAADAMU

త్రిపురసున్దర్యష్టకమ్ కదమ్బవనచారిణీంమునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్
నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||౧||

 కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.

Friday, 8 February 2013 at 19:53 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
కరువిరుత్తక్కుళినీత్తపిన్ కామక్కడుజ్గుళి వీళంద్
ఒరువిరుత్తం వుక్కుళలురు వీర్ వుయరిన్ పొరుళ్ క ట్కారు
విరుత్తం పుకుతామల్ కురుకైయర్ కొనురైత్త
తిరువిరుత్తాత్తోరడి కత్తిరీర్ తిరునాట్టకత్తే

గర్భావాసము,జన్మము ,బాల్యము,యవ్వనము వార్దక్యము,మ్రుత్యువు నరకము అను ఈ వ్రుత్త పరిధి లొ గానుగ ఎద్దుల మాదిరి తిరుగాడే మనము అమ్రుత మైన పరమపద ప్రాప్తి కి సులభొపాయం నమ్మాళ్వారులు అనుగ్రహించిన తిరువిత్త పాసుర పాదాల పారాయన ద్వారా పొందుతామని భాగవతులు ప్రసన్న భాషణ చేస్తున్నారు.

No comments:

Post a Comment