వుప్పు తగ్గించాలి
వుప్పు తగ్గించాలి ఎందుకంటే కారం రుచి తెలుస్తుంది.
రుచి సారం కారంలో,ఉప్పులో కంటే మనసులో వుంటుందట
.రుచి ఎంచి మాటల పాటవంతొ నానా రుచిరార్ధ వికృతులు
రంగరించి మనసు వండిన మంచి మరచి నోటితో కాటు వేస్తే
పదార్ధము పద అర్ధమై ప్రతి పదమూ తిట్టుకు చుట్టమౌతుంది.
ఇంక వండే వంట మండే మనసూ వేడికి మాడినరోట్టె,కూడని మొగుడు
అన్న చందాన కధ చీత్కారమౌతుంది. రుచి ఎంచ రాదు.
జిహ్వవ్ని బుజ్జగించు. మంచి మనిషి చేదు మింగి మంచి మేలమాడుతాడు.
అపురూపమైన కాకర చేదేకదా,అయినా రుచికరమే.
వగరు మావి చివురు మేసిన కోయిల తీపి పాటలని పల్లవిస్తున్నట్లె
భ్రహ్మ పదార్ధము నారగించి అమృతోపమయమని సంకల్పించుకోవలె.
ప్రాణసమర్పణములు సశ్యములు, మనకాహారములు,
సిబి కండరమిస్తే ఫల రస తృణకణములుమనకాకటికి
కృష్ణార్పణమై జీవించమని జీర్ణమౌతున్నవి.
ఆహారము నెంచగరాదు. వండివార్చిన దేవతల నెంచగరాదు
,నిక్కము, కనుగొంటే,రుచినెంచనివాడు సురుచి.
మనసును మన్నించిన వాడు సుమతి.
వేదార్ధము పదార్ధము పరబ్రహ్మ రూపం
సాక్షాత్ జీవాధారము.సంచితపుణ్యము
ఆకొన్నప్పుడు అన్న ప్రసాదయోగము.
సహనావవతుహ్:అని సహ వీర్యమౌ
అన్నము.మధురము,మన్నన ధర్మము.!!
No comments:
Post a Comment