Wednesday, September 9, 2015



. September 2014 at 11:48 UTC+05:30Tiruvengalan Swaamin updated his status.

వృద్ధికీ క్షయానికీ మధ్య అవధి




సుహృల్లేఖ రాయాలనే అనుకున్నా
కానీ పెదవి దాటుతూనే పల్లవి మారింది
సంతోషముగానే పాడాలనుకున్నా,
కానీ పూడుకున్న గొంతులోంచి ఖేదమే పలికింది
. సవ్యముగానే చెపాలనుకున్నా
కానీ సంగతులన్నీ అపసవ్యమైనవే.
నేను తలచేదొకటీ జరిగేవి రెండు
సంకల్ప వికల్పాల మధ్య దోగాడేదే మది.
ఓ మనసా వయసూ జారినా నీ క్రోధమాగదే
పిలిచి చిలిపి తగవులు మాట పదును నోటి తీటలు
తాట వలుస్తున్నా కనవేమే మనసా
గతము ఆత్మగతముగా చెప్పుకో
గొప్పలకి పోయి గోతులు తవ్వుకోకు
నేనేమీ ధర్మ రాజునికాను కానీ
అన్నీ ధర్మ పన్నాలే నావి అందుకేనేమో
శ్రోతలు మరీ మరీ నవ్వుతున్నారు
నా శ్రీ రంగ నీతులు వినీ వినీ..!!

Sunday, 14 September 2014 at 11:37 UTC+05:30

వృద్ధికీ క్షయానికీ మధ్య అవధి
పడిలేచే జీవన వ్యాపనము.
అమీబా నుంచి అంతరించిన
సరీ సృపాలవరకు మస్తకమే
శరీరమై బక్షణమై జీవనమై
చరిస్తాయి మనిషీ! చీమని చూడు,
పాముని చూడు. అవ్యయమైన
ఆలక్షణాన్ని చూడు.
అల్లాగే అంతరించిపోకుండా
నడిచి నిలబడ్డ అనాది
మానవుని చూడు.. గమము
సంగమమూ కన్న వ్యుహంతో
సమూహంతో వడితో ప్రకృతిని
శాసించిన నీవారిని స్మరించుకో.

No comments:

Post a Comment