రూపాన్నిచ్చింది మేమే.
రూపాన్నిచ్చింది మేమే.
సాకేతాన్ని,అంతర్జాల వైభవాన్ని
మా స్వంత ధననాన్ని ఇంధనముగా చేసి,
మాయ మయ సృష్టి చేసిందీ,భాగ్యనగరాన్ని,
తీర్చి దిద్దిందీ మేమే,ఆంధ్రులము,
కుబేరులూ,ధనబేహారులూ,ఇంద్రులూ చంద్రులూ
రెద్దివారూ,కమ్మవారూ,అయ్యవారూ,అమ్మగారూ,
పిల్లవారూ,పెరికవారూ,కల్లుగీతలవారూ,
వడ్డెరవారూ,అడ్డనామాలవారూ,నిలువు బొట్లవారూ,
చిక్కాకుల కులీనులూ,విజీనగర వీణవంకలవారూ,
వయిజాగు జాగు వారూ,తుని బాణాలవారూ,
రాజమండ్రీ రంగుల రత్నాంగులూ,చిత్రాంగులూ,
బెజ్జంకొండ ఎల్లూరు,మోగధీరులూ,చిరంజీవులూ,
రామోజీ,లక్ష్మోజీలూ,ఆపాటి వారూ,ఈపాటివారూ,
నెల్లూరివారూ,నీలంవారూ,పొట్టిస్రీరాములవారూ,
గాలివారూ,ధూళివారూ,ఖగోళంలో జండా పాతినవారూ
అందరూ మావారే,పెట్టుబడులూ,పట్టుబడులూమావే
ఇది జగ మెరిగిన సత్యంకాదూ,హయిదరబాదు
అఖండాంద్రప్రెదేసూ మాదే,మనదేలే,ఓణీలూ,బాణీలూ మావే
అయినప్పుడు తెలంగాణా మీదెట్లు,మాటకు వస్టే,పని మానేస్తాం,
పాటలాడుకుంటాం అప్పుడు మీరల్లరి పడినప్పుడు
మేమేమన్నా చప్పుడు చేశామా,ఇప్పుడుకుదరదంటె,
కావాలంటే,ఎన్నాళ్ళైనా బళ్ళనాపేస్తాం
మాకు జరుగు బాటుకు సంబంధం లేదు,
ఆకలైతె,అరిష్టమైతే దానికి ఢిల్లీదే బాధ్యత
ఎంగ్లీషు వాళ్ళు పోవాలి చావాలి,వాళ్ళ బొమ్మల బుర్రలు
చితక్కొడతాము,కొట్టాముకూడా, మా త్యాగల ముందు
ప్రపంచము సాగిలపడాల్సిండే అని ఏమనుకోకండి
అహింసే మా వంతు,పని కానిస్తాం కానీ
కానీ కూడా హయిదరబాదులోవదలం.
No comments:
Post a Comment