పలు వరుసల మెరయు పలు మారులు నగవు
పలు వరుసల మెరయు పలు మారులు నగవు
చిరు దీప కాంతులు పర భక్తి తత్పరతలు
వలిపెంబులు,నగలునాణ్యంబులుగా వెలయించినట్లుగుపించె
మాతల్లి ఇలను వదలి కడుదీర్ఘ కాల మయినను
మరువదె మన్నన ,గిట్టినదాక యెరుగని శుభశాంతమ్ములు
సొమ్ములై అలరించు పరిమళ పవిత్ర శోభల,
కనిపించు కలలయందు ఇదెట్టి భాగ్యమో.
వరు వాత ఝామున కూర నొండెద తండ్రీ, తరిగి
నారలిచ్చెద వార జరిగి దోసిలి పట్టనుచు,'
వీరలు వారలని యెంచకు, అందరికినొక్క తెరగు పంచు.
కరువేదియు లేదు, కరుణాళువు నీ దైవము,
కూడి సంపదలిచ్చు. నిరతాన్న భక్ష్యముల జీవుల
నాదరించు,నాకు తృప్తయ్యెడు. వేరువిధములొద్దు
మదిన మన్నన కలిగి కలి బాధలు కడగుము.
ఇదిగో తెలవార వాకిట నే తొలగిపోవలె బిడ్డా
ఉషోప్రాతహ సంఝ్యలందు అమ్మని నే,
నీ మన్ననకై తలచెద,దీవనలిచ్చెద తల
మెలకువలో తండ్రిని తండ్రితండ్రిని,ముద్గలసా పుత్రుని,
శేషధీమణిని ఎంచుము,ప్రార్ధించుమనుచూ చిరువెలుగు
చాటున తొలగిపోయె అమ్మ మాయమ్మ కృపాబ్ది
ఇచ్చు మచ్చరములేని స్వచ్చతగల వాక్య నిరూఢిని
హృదయాంచిత దయా ధర్మాదిక స్పృహలను.
No comments:
Post a Comment