Wednesday, September 9, 2015



రాధ ప్రేమించింది,కానీ,




రాధ ప్రేమించింది,కానీ
మాయమర్మమూ ఎరుగదు.
ప్రేమంటే తెలుసా రాధా, అని
అడగడానికి తనకి ధైర్యములేదే,
తనలో తనువులో కలిగే అలజడేనా ప్రేమంటే,
మనసుకానిదేదో ప్రశ్నిస్తూనే వుంది తనని,
వినీ,వినని మనసుకు కనీకనిపించని బుద్ధి
అమ్మా నాన్నా తిరస్కారపు చూపైపోయిందీ
, అంతే కాదు ప్రేమంటే, పులకింతా
వలపుల గిలిగింతా ఇంతా అంతా అని
చెప్పలేని మాయా మరోటీనూ
మరి దీనికన్నా నాకింకేమిష్టమూ,
రాగాలుతీసే రాధ మనసూరుకోలే
ప్రేమిస్తూనే వుంది,మనసా వయసా
కాటుకకంటి మిలమిలమెరుపా,
సిగ్గరి బుగ్గల ఎరుపా? ఇదీ తను
అంటే మనసు పాడే పాటల పల్లవింపు.
ఏది రాధా చెప్పమ్మ నీ ప్రేమకాధారము
అని ప్రస్నించేబుద్ధి అదిగో మనసుకు
తోడైపోయింది,మాయలోవుంది
మా అమ్మాయి అడిగితేకానీ వెన్నైనా
తినదనుకుంటునే వున్నాడు వాళ్ళనాన్న
చూపులు నేలకి చూస్తూంటే మాటలు
నీళ్ళునముల్తూంటే అమ్మా నాన్నలు
దూరంజరుగుతున్న నీడల్లాగా, పుటాకార
కటకములోంచి కనుపించే బూచిల్లాగా
పిలవని పేరంటానికొచ్చిన పోలీసుల్లాగా
కనపడ్డమే గాక కల్లోకీ వచ్చి కల పాడుచేస్తున్నారు
. సారీ రాధా కృష్ణుడు ధైర్యం చేస్తే బాగుండ్ను

No comments:

Post a Comment