సగటు మనిషికి
సగటు మనిషికి ప్రాంతాలూ ఒకటైనా రెండైనా తేడాలు భూతద్దంతో వెతకాల్సిందే.
బతికుంటే బలుసాకు తినచ్చని అప్పుడు సాయబులు దండెత్తినప్పుడు
మనమల్లా పదకొండో అవతారమల్లాహ్ అన్నాము. అని వూరుకున్నామా
రాజే దేముడని ఱుజువు చేశాం మేకని వాళ్ళు నలుగురూ కుక్కంటే
నిజమే అని నిజాన్ని వెలిగించాము. పాలిచ్చేవాళ్ళూ పాలించేవాళ్ళూ మంచినీళ్ళలా
నిజాన్ని పలచనచేస్తే కలి ధర్మమని మన ఖర్మమనీ సరి పెట్టుకున్నాం.
జాతి ఏదైతేనేమీ మనమంతా అంధక పుత్రులమే. కానీ తెలుగులంటే
వెలుగులట వేగులట, కోమటి వేమన్న,రాయల రాచన్న
కుతి తీరింతర్వాతే సుమతి మతులయ్యారు. అయినా చచ్చేముందు
తెలివి అరే కొరివి వెలుగూ రాత్రి అయితేచాలు బాటలన్నీ
శృంగారపు తోటలే. ఎంత రోత తిరుపతి నుంచి పరపతి గల అన్ని నగరాల్లో
,కుబ్జలూ,లంపటులూ, దెయ్యంపట్టిన బాపడూ వాడి కక్కూర్తీ,
జబ్బులు క్రీడల్లో పరుచుకుంటూ,క్రీనీడల్లోంచి తొంగిచూస్తూనే వున్నాయి
లోకమింతమారినా, ఆశోకుడు నాటిన చెట్లు చచ్చినా బాటా సింగారం రంగుల వికారమూ,\
సజీవంగా కొత్త రూపాల్లో వెలుగుతూ ప్రాణానికి మానానికి వెలగట్టేస్తున్నాయి.
ఇప్పుడు దేశము రెండైటే ఒక్కటిమాత్రం నిజం. మనమంత తొందరగా మారమేమో,
నీతి నిజమూ,చావూ,పుట్టుకా, దేని దారి దానిదేనను కుంటాను
తప్పైతే,నామాట తప్పైతే ఈకైతని మళ్ళీ మళ్ళీ చదవకండి
నాకదే శాస్తి,కవికి తిరస్కార మేదండన.
No comments:
Post a Comment