నే కొట్టుకుంటూనే వుంటాను,
నే కొట్టుకుంటూనే వుంటాను,
ఇప్పటివరకూ నువ్
చెప్పినప్పుడే రెప్పలార్పేను
,కానీ నాకూ ప్రాణముంది,
నా ఇష్టమొచ్చినట్టు ఆర్చుకుంటాను.
మందులేస్తున్నావా గుర్తుందా
ఆసామెత! కొండనాలిక్కి మందేస్తే
వున్న నాలికూడిందట
రెప్ప పాటు కాలము అది
తీరేదాకా పడుతూనే వుంటుంది.
నేనీ మొహానికున్నా నామొహం
నువ్వేమీ చెయ్యలేవు నాకు చలిత
చాలక స్వయము శక్తి వచ్చేసింది.
నే నిప్పుడు అంతర్భాగపు భాగ్యాన్ని
కాదు నువ్వు శాప గ్రస్తవైతే , నాకు
స్వేచ్చ వచ్చింది ప్రాణముపోతే చూద్దాం
అప్పుడాగుతానేమో! కన్నుని వున్నానుగదా
అని నన్ను బానిసగా చూశావు
ఎంతని చెప్పను నావలన నీమనసెంత
కుళ్ళుకున్నదో ఓపక్క బుద్ధి మందలించినా
సభ్యత ఆలించినా భోగాలన్నీ
క్షణభంగురాలేఅని ఆత్మ మొత్తుకున్నా
విన్నావా,మనసా విచారించకు,
వినమ్రవై సుమతివికమ్ము వున్న కన్నైనా
మంచిని చూసి వైతఱణిని దాటిస్తుంది.
Tiruvengalan Swaamin updated his status.
గతించినది కాలము,చేసినది కొద్ది చూసినది చూసినదే జరిగినది మంచికేనట జరగబోవునదీ మంచికేనౌగాక మనసుచేసే తొందరకావల మాయ విసరే వల కాలానికి కొలమానము మనసా వేధించకే తీరికలేని కోరికల వూబిలోకి జారకే, సుబుద్ధి చేతకానిదని ఎంచే తరుణము గతించినది, కాలమాగదుగా మరి కరవనెంచిన గతము కరిగిపోయింది గదూ, స్తిమిత పడు ఓ మనసా, బుద్దికి పని చెప్పు పుస్తక మదే చదువుతుంది, బొమ్మలూ అదే గీస్తుంది మళ్ళీ సంవత్సరానికి ఒక రూపులోకొస్తుంది బతుకు ఏమంటావు, కొంచము సముదాయించుకు చదూకో ఎంతైనా మనమూ, మనసూ ఒకటేగా
Tiruvengalan Swaamin updated his status.
శ్రీ కాంత్ మంచు చల్లగా వుంటుందని తెలుసుకున్నాడు నిప్పు వేడిగా వుంటుందని అదివరకే తెలుసు వాడికి. మనసును మంచు పల్లకీలో వూరేగించేస్తున్నాడు ఇప్పుడు వాడి హృదయమంతా ఆత్మే మరి మనసు ముడుచుకుపోఇందిగా దూరాలు చలికాలములో పొడుగవుతాయి, భారమూ పెరుగుతుంది కానీ ఓర్చుకుంటే వినయ వివేక జ్ఞానము సొంతమనే నేర్చాడు వాడిని క్రొత్త సంవత్సరము సాహస లక్ష్మి వరించుగాక!
Tiruvengalan Swaamin updated his status.
యశస్వినివైతివి మాయా కృష్ణ శోధనచే మాతల్లి యశోదా కన్నయ్య నోటిని శోధించిtiవిట గదమ్మా యశోదా మృత్తికల జాడలేమొగాని ముజ్జగముల కవల ఘీంకార హుంకార పదఘట్టన ప్రేంఖణానంద వరాహ ద్యుతిని ఉగ్రహిరణ్యగర్భఛేదక ప్రహ్లాద వరద నారసిమ్హ విజృంభణమును కమఠ గ్రాహక ధరణి శయ్యా విలాసమును హాలాహలస్ఫోఠక దేవ దానవ సంక్షోభితక్షీరార్ణవమును ఉళగళంద విశ్వరూప బలిహార ప్రకటనను పురుషోత్తమ గురు రామ ప్రాభవమున్ను నిజ నేత్రమ్ములజూజి చూడజాలక మూర్చితవైతివి ఓయమ్మ యశోదా మాఇండ్లను కడవల పాలుపెరుగుంచితిమి పంపుమమ్మ కన్నని మా కష్టములు కడతేర్చగ!
No comments:
Post a Comment