అమరులంటే మరణము లేనివారు.
అమరులంటే మరణము లేనివారు.
మరణమంటే భ్రమణాంతము. అంతమంటే
తెగిన తుది కవ్వల మిగిలిన పెంజీకటి
అమరులు మరులు లేనివారు
కోరికల నిర్యాణమే అమరము ఆకలికన్నా
దప్పికకన్నా విహ్వలము మరణ భయము
భయమే మరణానికి అరక్షణం పట్టని కారణము
కర్మలన్నీ క్రియలు కావు. కర్మ కాలధర్మమే మరణము
. ఆకలి అంటే మరణము కలికాల ధర్మమే ఆకలి
చాలని మనోదీపనమే శరీరానికి నిత్య మృత్యువు.
క్షణ క్షణమూ చస్తూనే వుంటాము. కణ కణమూ
నశించడమేకారణము, వశించాలని పుట్టుకొచ్చే
కణజాలము నసించే వాటికన్నా నిదానము.
కాలాతిక్రమణమే మరణము. నిర్జీవ కణాల తోరణము,
ధైర్యము నశించాలనే మనస్సు ధరించే మరణ పరి హారము
వద్దన్నా వచ్చేది తుది. అది చేరకముందు
కోరిక నివురు కప్పిన నిప్పు,సంకల్పాతీతం,సంగతం.
మాయ,మావి,మరణము వూహ వూయల వుత్థానము
క్రియ కర్మ కర్త అహము దేహము,మోహమూ.
పూర్వ సువాసనలు జ్ఞాపకాలు,గతించినవి
వుత్తరంగా పోతే గుర్తులు ఒంటరిగా వెతుక్కోవచ్చు.
మరణము క్రిమి కీటాకాలూ జంతుజాలాలూ అనుగమిస్తాయి
అవి ఎల్లప్పుడూ చావుకు సిద్ధము గిరికీలు తిరిగి వుత్తరంగా పారిపోతాయి.
ఆదినుంచీ నేతి నేతి అని ఒక్క మానవుడే మొత్తుకుంటున్నాడు
పరబ్రహ్మ స్వరూపాన్ని తనలోపలి చీకటిలో వెతుక్కుంటున్నాడు
. కానీ మరణించాలనే తిర్యజడాలు నిత్యము భావిస్తూ వుంటాయి
మనం హింసిస్తే యేడ్వవు. అవి రాళ్ళూ నీళ్ళూ కావు వాటికీ కన్నీళ్ళుంటాయి
. మనిషి అన్నిటినీ యెంచుతాడు. వాటికి పరమపదమే ఎంపిక
Thursday, 3 October 2013 at 09:40 UTC+05:30
No comments:
Post a Comment