ఘనమగు యా యల్పజీవి
ఘనమగు యా యల్పజీవి మనమును పరికించి
ఘనమగు బోయ మనము ద్రవించి కన్నులు తడచె
ఘనమగు త్యాగ నిరతిన అల్పమాయె క్రూరత
ఘనమగు జగతిన కొలువైన విలువలె ధనములు
భొరున విలపించె బోయ కడు ధుఖమున
నీరైన యాతని కన్నులు కనుగొనె సత్యము
చుట్టంబౌనది శాంతి దయ గల మనము
పచ్చి నిప్పుల బడి వండబడి బువ్వనిచ్చె
ఈకపోతములు నాకు తల్లి తండ్రులు
జ్ఞానమిచ్చిరి నే బాసెదనీక్రూర కర్మములిక
పొందెద దయ యేస్వర్గమునందది పాలసముద్రమొ
నందే వేలుపు శయనించియుండునో నావేలుపు
జీరెద మిగుల విమల మనమున
నిట్లెంచి తను వలల ద్రుంచి
జీవములకు స్వేచ్చనిచ్చి
వెండి
నమ్మగ రానిది నా మనసు,
క్రమ్మరి నెమ్మదిన పెండ్లాము
పిల్లలను భ్రమలనిల్పు',
దిమ్మరిని, మనమను అడవిన
చెలరేగిన కిరాతుడ కొమ్మలచాటున
కువకువలాడెడుపిట్టలచంపు క్రూరుడ
నే సర్వ బంధములిక వదలి రగిలెద
తపమను నిప్పునబడి ప్రాయశ్చిత్తము
నొందెద నా ఈ యాశల ప్రాణము
కాల్చి వేచెద యని వగచి, కన్నుల
సతతము కపోతముల కాంచుచు
తను విహ్వలుడై అడవిన పారజోచ్చె,
వెండి
కపోతియు మండెడి నెగడున బడి
తన మగడిపొత్తును జేరగ, నాజంట
దివ్యదేహులై కైవల్యమును జేరె!
బోయ ఆర్తిన అనంతధుఖమున
కానలబడి కన్నులు కనరానివయ్యి
దావాలనమున జిక్కి దివ్యలోకములకరిగె!!
No comments:
Post a Comment