June 2014 at 20:42 UTC+05:30
సాహితీ లోకము
.
సాహితీ లోకము లో పద్య గద్య భావ ప్రకటనా మార్గాలు వున్నాయి. నవరస సమ్మిశ్రమమైన భాషా సౌందర్య వనములో ప్రమధ గణాల వలె వాటి అమరికతో గమకాన్ని సౌందర్య వైచిత్రినీ భావ పరిమళాన్నీ భావుకతా వైభవాన్నీ ఎంచి పంచి పెడతాయి. అన్ని విషేషాల అలరింపు కారణానే పద్యములు రచనకి రస పుష్టి విషయ తుష్టి కలిగిస్తాయి.
ఇతనికంటే మరిదైవము కానము
యెక్కడా వెదకిన నితడే అతి
శయమగు మహిమలతో వెలసెను
అన్నిటికాధారము తానె ||
మదిజలధులనొకదైవము
వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే
ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే
భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే
శ్రీనరసింహంబున్నాడు
తెలిసి భూనభోంతరమున
వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే
పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన
తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన
కృష్ణుడు రాముడునైనారు ||
పొంచి అసురకాంతలలో వెదకిన
బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట
వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన
అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున
వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు || copy paste from the Radio Station Of Jagadanandakaraka by Balakrishna Prasad
No comments:
Post a Comment