నాకూ,చెట్టుకీ పుట్టకీ నేల కావాలి
నాకూ,చెట్టుకీ పుట్టకీ నేల కావాలి,కానీ నా మనస్సుకు అఖ్ఖర్లా,
అది పగలూ,రాత్రీ గణించక తిరుగుతూనేవుంటుంది,
ఎవ రెవరైనా వరసైనా వావైనా పురుగైనా పుట్రైనా
చెట్టైనా మట్టైనా మనసైనా దానికొకటే,
అనుకుంటే వాలిపోతుంది,దేహానికి పని కలిగిస్తుంది.
స్పందనలన్నీ అందించి ఆనక సంబధంలేనట్టు
అమాయకమై అహం దెబ్బతిని కుయ్యాలిస్తుంది,
'బుద్ధి' కి తోచింది చెయ్యమని చెప్పినా
ఏమాత్రమూ బుద్ధికి లోబడదు అర్ధానికి కామానికి,క్రోధానికి,
"దేహమా నువ్వే అధికారివి, తోచింది స్పర్శించి ,
స్పర్శించి ఆశించి, ఆశించి అనుభవించ" మంటుంది.
గిజిగాడిలా చెవిలో పోరై బొందకి ఆశై 'అద్రుష్టముంటే' దొరకక
పాడుచేసి పాదుకుపోతుంది,ఆనన దొరికిపోతే
ఎన్నోసాకులతో సాయంచేస్తుంది బొందకి మనసు,
కానీ, అనర్ధము జరిగిన తరువాత,
చిరిగిన దేహం మలినమైపోతుంది.
మాసిన వస్త్రాన్ని,చిత్రగుప్తుడు దస్త్రంలోంచి తొలగించేస్తాడు.
అప్పుడు అస్త్ర సన్యాసం చేసిన నాకు నేలకావాలి,
పంచభూతాల పంచన జేరి మళ్ళీనేను పరిమళించాలి.
No comments:
Post a Comment