Tuesday, 20 January 2015 at 12:42 UTC+05:30
ఆత్మ ధనమును
కన్నులకేల కవి వలవేయవలె యవి స్వామి సుందరేశునివికావె
వక్షములనేల తలచవలెనవి ఔషధామృత మేదినీ గిరివ్రజములుగదె
కలికియందములు యవ్వనపాటవమ్ములు
తరులతాసుమసోభిత ప్రకృతిమాతకుసాటియె
కవీ కాంచుము కమనీయ జ్ఞానామృత నగ ఖగ మృగ పూరిత
వన జననిని యుగయుగముల ఝరీఝుర నదీనదములను
తళుక్కులీను విశ్వాంతరాళమును గంభీర ధీర ప్రణవఘోషల
కడలి బాసను తుచ్చ ఛిద్ర మాంస ప్రేంఖణ శారీరికముల గోల
పూర్వ కవులెల్ల కర్పూరవిడెముల నారగించి విఛలించిరిగద
కానవె జ్ఞానాంబిక సౌందర్యమును స్పర్సిచవె పవిత్ర
మాతృభావనను ఎంచవె ఘన జీవన ఆత్మ ధనమును
No comments:
Post a Comment