Wednesday, September 9, 2015



నొసట మూడు విబూతి రేకలు




నొసట మూడు విబూతి రేకలు
పిలకనెడి తల కొత్తెము
బుజమున గావంచ నెంచ
కడు బారెడు అంగ వస్త్రమండ్రు
మెడన ముప్పేటల తాడుజందె మండ్రు
కలికెము వేసిన అగపడని కోపము
కడు ప్రశాంత వదనము
ఎవ్వైరనుండనోపతడు
జగముల చదవనెంచిన
నిజరూప ధారి బాపడు
అయ్యా ఆశలకు అక్కరలేదు
మాసికల చిరు పంచె
మంచి మంత్రము మనసును,
గుండెల గడియల కవలనుంచ
మరి మాటలు మాత్రము
 పంటి కింది తీపి పాటలు
ఒకచో జందెము వడుకు
కొండొకచోట కాయ కష్టము చేయు
కరువన్నది ఎరగడు
బిక్ష పాత్ర అక్షయము కద
అడవులన్న జంకు లెదు
భూతముల మైత్రి నెరుపును
పంచ భూతాత్ముడనని ఎంచి.
కౌపీనమె కడుపెన్నిధి
క్షీర నీర న్యాయమున
సమాజ సంధికి బీజమతడు
ఒకనాటి మా తండ్రి కొసరు రూపిది
నేటి కాలపు అన్న దమ్ములు
చేతిరేకలు మసి బారినవయ్యో
శంకరుని మరచి కింకరత్వము
గ్రుచ్చి బిగి యార కౌగలింతురు.


తమ్ములార బొట్టులేక
మొగము చిన్నబోవు
పగలు చీకటి మాయ,
వెలుగు కాదది రగులు
రాగద్వేషముల జోలలూగు
శరీరము వ్యక్తి కాదు
బొంది స్వర్గమున జొరనేరదు
తిలకమో నొసట పుండ్రములొ
 పొసగ బాపడ నిన్ను తట్టిలేపు.
చీకటి మాటు మాయనుండి

No comments:

Post a Comment