Monday, September 7, 2015

ఉద్గారము అంటే వెలువరించబడడము







: ఉద్గారము అంటే వెలువరించబడడము
అది అత్యంత స్వాభావికముగా ధాతు వ్యయము చె పదార్ధత నసించి శక్తిగా అంటే వెలుగుగానో వేడిమిగానో లుప్తమైపోవడము. ఒక విధాయక పరిక్రియ లేక ఆచరణము. వుద్యమంలో జీవధాతుశక్తులన్నీ విధాయక పరిక్రియలో ఫలాన్ని లేదా ఆశయాన్ని పొందగలందులకు ఖర్చైపోవడము.మన శక్తి వుద్గారమైపోతున్నదన్నమాట. మనము మిగిల్చుకున్నదెమైనావుంటే అది ఖర్చైపోయిన జీవ శక్తికి మించి వుండాలి. అంటే భావి తరాలకని మాత్రమే వుద్యమము చెయ్యాలీ అదీ వృధా కాకూడదు. అటైనా ఇటైనా ఫలితము జాతి నిర్వీర్యమైపోకూడదు. పొంచి వున్న పులి, విడిపోయిన ఎద్దులని అవలీలగా ఆహారము చేసుకుంది. కురు యుద్ధము తరువాత పీనుగుల పెంటని పంచభూతాలూ స్వాహా చేశాయి కాని అన్న దమ్ముల పోరాటాల్లో ఈరోజు మిగిలేది కన్నీరు వ్యధా నస్టమున్నూ మాత్రమే. కాడికి నలుగురు కావాలి. కావడికి ఇద్దరు కావాలి,ధర్మానికి కర్త ఒక్కడే కావాలి. ఒక ఒర కి కత్తి ఒక్కటే వుండాలి.సంసారానికి రెండు సగాలు పార్వతీ పరమేస్వరులుగా సగం సగం నిండవ్వాలి. జాతికి భావ సారూప్యతా,ధర్మ బద్ధత,నిజ క్షేత్రములో నిర్ణాయిక ధర్మ జీవనమూ మాత్రమే అవసరము. మనది సర్వ సత్తాక గణ తంత్రం. నిజానికి ప్రతి పంచాయతీ ఒక రాజ్యమూలకమే అయి వుండాలి. ప్రతి జిల్లా ఒక రాష్ట్రంలాగానే పరిగణించ బడాలి. అనేకజిల్లాలు ఒక ప్రాదేశిక స్వరూపము కలిగినవి సామ్రాజ్యమౌతాయి. ఒక సామ్రాజ్యంలో అనేక కళలూ,భాషలూ,రీతులూ,వృత్తులూ,వైవిధ్య పూర్వకముగా వుంటాయి. ఇక మహా సామ్రాజ్యమంటె సార్వభౌమిక సర్వసత్తాకత కల్గి ఒకే జీవసంస్కృతీ వుంటాయి. పుట్టకనుంచి చావు దాకా ఒకే కర్మ కాండలూ,ధర్మ భావనలూ చరిత్రా ఇతిహాస పురాణ రుషి సంపదా మహా సామ్రాజ్యము కలిగి వుంటుంది. మనది ఉప ఖండము. అదివరకు చక్రవర్తులు పాలించారు. మన సంకల్పములో జంబూ ద్వీపమూ,భరత వర్షమూ,భరఖండమూ అని తలుచుకుంటాము

No comments:

Post a Comment