Krishna and YasOdaa
గతించినది కాలము,చేసినది కొద్ది
చూసినది చూసినదే, జరిగినది మంచికేనట
జరగబోవునదీ మంచికేనౌగాక
మనసుచేసే తొందరకావల,
మాయ విసరే వల
కాలానికి కొలమానము
మనసా వేధించకే తీరికలేని
కోరికల వూబిలోకి జారకే,
సుబుద్ధి చేతకాని దని
ఎంచే తరుణము గతించినది,
కాలమా గదుగా మరి
కరవనెంచిన గతము
కరిగిపోయింది గదూ స్తిమిత పడు
ఓ మనసా, బుద్దికి పని చెప్పు
పుస్తక మదే చదువుతుంది,
బొమ్మలూ అదే గీస్తుంది
మళ్ళీ సంవత్సరానికి ఒక
రూపులోకొస్తుంది బతుకు
ఏమంటావు, కొంచము
సముదాయించుకు చదూకో
ఎంతైనా మనమూ, మనసూ ఒకటేగా
.
శ్రీ కాంత్ మంచు చల్లగా వుంటుందని తెలుసుకున్నాడు
నిప్పు వేడిగా వుంటుందని అదివరకే తెలుసు వాడికి.
మనసును మంచు పల్లకీలో వూరేగించేస్తున్నాడు
ఇప్పుడు వాడి హృదయమంతా ఆత్మే
మరి మనసు ముడుచుకుపోఇందిగా
దూరాలు చలికాలములో పొడుగవుతాయి
భారమూ పెరుగుతుంది కానీ ఓర్చుకుంటే
వినయ వివేక జ్ఞానము సొంతమనే నేర్చాడు
వాడిని క్రొత్త సంవత్సరము సాహస లక్ష్మి వరించుగాక!
యశస్వినివైతివిమాయా కృష్ణ శోధనచే
మాతల్లి యశోదా కన్నయ్యనోటిని
శోధించిtiవిట గదమ్మా యశోదా
మృత్తికల జాడలేమొగాని ముజ్జగముల
కవల ఘీంకార హుంకార పదఘట్టన
ప్రేంఖణానంద వరాహ ద్యుతిని
ఉగ్రహిరణ్యగర్భఛేదక ప్రహ్లాద వరద
నారసిమ్హ విజృంభణమును
కమఠ గ్రాహక ధరణి శయ్యా విలాసమును
హాలాహలస్ఫోఠక దేవ దానవ సంక్షోభితక్షీరార్ణవమును
ఉళగళంద విశ్వరూప బలిహార ప్రకటనను
పురుషోత్తమ గురు రామ ప్రాభవమున్ను
నిజ నేత్రమ్ములజూజి చూడజాలక
మూర్చితవైతివి ఓయమ్మ యశోదా
మాఇండ్లను కడవల పాలుపెరుగుంచితిమి
పంపుమమ్మ కన్నని మా కష్టములు కడతేర్చగ!
No comments:
Post a Comment