గర్భకోశంలో లేశమంత విషము
గర్భకోశంలో లేశమంత విషము
అర్ధాన్న భూమిలోంచి మొలిచిన మొండిచెయ్యి
తనకే అవగాహనలెని తనలో పొంగిన సునామీ
ముంచుతున్నామో మునుగుతున్నామో గమనిక ఏదీ?
మనుష్యులమే అయినా మనము మనలోంచి
ఇప్పుడు తోడేళ్ళు తొంగిచూస్తున్నాయి.
భూమిని పాములు పంచుకున్నప్పుడు
కొంచము పాలు దొరికాయని పిల్లికూనలయ్యాము
కుంచాలతో సంపద కొల్చుకున్నా మంచి అన్నాము.
అవునూ,ఇప్పుడు మంచినే చూద్దాము.
గట్టవతల అన్నా గడ్డపారతో కొండలు తవ్వి
రాళ్ళతో కోటలు కట్టావా,అవి మావి,
మేము సత్య వాదులము సత్య వాణులము
స్నేహాన్ని శాంతినీ సతతమూ పాటిస్తాము,
వూళ్ళలో గోతులు తవ్వాము,అవి అవి మనవి.
కానీ చెరువులో చేపలు చెలియలికట్ట దగ్గర
వుప్పు తోటలూ,వరదకి కొట్టుకు పోయాయి,
అప్పుల బాధకి తాళలేక పెద్దపురమునించీ
అమలాపురమునించీ రాజమందిరమునించీ
చిలకలూరిపెపేట నించీ, గుంటూరునుంచీ
బలిపీఠమెక్కి ఘొషిల్లుతున్నాము.
అన్నాన్ని,కన్నవాళ్ళకిపెట్టకపోయినా
అపురూపంగా భాగ్యనగర సమాధులని
తీర్చి దిద్దాము, ఆనాటి వుప్పు మీదైనా,
ఈనాటి కూరమనదె! ఏమన్నా అనకున్నా
సమైక్యమే మానినాదమూ, విషమైనా విషయమైనా
ఇదిగో త్రివర్ణ పతాకంలో పాకాన వండాము
గాలి జనార్ధనుడూ,జోలిజ ఘనూ,జైలు వార్డెనూ
,కీలి కిరణూ,పితాని సత్తెమూ పిల్లి బాసూ,తల్లి క్రిపా
నల్లేరు జనాలమూ కొల్లేరు బిడ్డలమూ,కాళింది నుంచి
తాదంగి దాకా మనమందరమూ సమైక్యమే,
మందుకీ విందుకీ కులమడ్డం కాదు,మతమేమీ లెఖాలేదు
మనమందరమొక్కటే,ఎందుకంటే,కోటలో ధాన్యమూ
,ధనమూ, అర్ధమూ,పర్ధమూ అన్నీ వున్నాయి.
తెలిసికొవోయీ తెలంగాణా మాలోకమా.
మంచి వాడివే కానీ నీ నాయకులు మత్చల వారు,
పులి చారల కలికాలంవారు. వుందాము కలిసి,కావాలంటే
మాపట్నానికిరా, మాచాపలచెరువుల్లో దొరువులు చేసుకో,
మాగనుల్లొ మెతుకు దొరికేను,మా పనుల్లో పైసలు
పండేను,ఇట్లు సోదర సాదరసోదరీమణులము.
No comments:
Post a Comment