జీవిస్తామంటే పుట్టకపై ఆశా
జీవిస్తామంటే పుట్టకపై ఆశా,చావంటే భయమూ కాదుగదా,
కనుపించని భవితvyaaన్ని కళ్ళారా చూడడమూ,
కని పెంచే వూసుల మాయానూ అనుకుంటా,
ఎండిన కాయ వళ్ళువిర్చుకు విత్తుల వెదజల్లేనూ
, తొడిమవూడిన దోస ఎడములేకుండా తీగలయ్యేనూ,
మఱ్రి తొఱ్రలో తాడీ,నెఱ్రెలో జెముడూ జీవకాలే
బతుకుపోరాటములో బహూకృత రూపాలే.
నదులూ,పొదలూ అడవీ,ఎడారీ ప్రసవిస్తూనే వున్నాయి
హాస్యము కాదుకానీ ఇవన్నీ రహస్యముగా జీవిస్తాయి
. ప్రకృతి వాటి ప్రసవ వేదనని పంచుకుటూంది,
కానీ మానవుడా నీ జీవలక్షణమెంత చిత్రము!
కోరికలే ధాతువులుకదూ,జీవనముకన్నా కామనే ఎక్కువ కదూ
ఎన్నింటిని తింటావో ఎమి కంటావో నీవారసత్వము
కోరికల సూకర న్యాయమూ,నాభి కృమిఘోరమూ
ఏమంటావు జీవించి చద్దామనుకోవు
చచ్చైనా జీవిద్దామని అన్వేషిస్తావు కదూ
ఎగొడుగైనా నీదే నీడలూ నీవే,నిప్పెట్టైనా జీవిస్తావు,నిజంకదూ
No comments:
Post a Comment