Sunday, September 6, 2015

ఒక బంధం నిశ్శబ్దం ఐందంటే




ఒక బంధం నిశ్శబ్దం ఐందంటే అందుక్కారణాలు అనేకం!
గుండెల్ని తూట్లు పొడిచిన అవమానాలుంటాయ్!
మనసుల్ని చీల్చేసిన అగౌరవాలుంటాయ్!
పెద్దరికాల్ని మంటగలిపిన అహంకారాలుంటాయ్!
ఆత్మీయతల్ని అణగార్చిన స్వార్థపరత్వాలుంటాయ్!
ఏమిటిదని అడగలేని ప్రేమలు మూగపోతాయ్!
ఎందుకిలా అని నిలదీయలేని మంచి తలదించేస్తుంది!
మౌనంగా తప్పుకున్న మమతలు, మమకారాలు,
ఎడంగా జరిగే ఏ బాంధవ్యమైనా ఎడారి జల్లే!
 

No comments:

Post a Comment