కదర్యుడు--2
హృదయ గ్రంధులట,అహం కార మమ కార, రుచిరాది
గుణ గణ్యములు వూర్వారుకమువలె, తోడిమకైవడి
విడివడినంత, శాంత సమ్మాన మనస్కుడై, మౌనియై,
హంసయై, పరమపద దౄగ్గోచరుడై,కదర్యుడు
ఇంద్రియముల, ప్రాణమ్ముల నిగ్రహించి,
సూన్యుడై, దీనుడై బిక్కుడాయె.
సత్పురుషులు,గారవగృహిణులు,
బాలాది వౄద్ధ సమూహములు
చిక్కి,మలినమైన జడధారి కదర్యుని
కనుగొని తొలగిపోజొచ్చిరి. ఏహ్యతా
తిరస్కారము లతడు యోగ్యతా
పురస్కారములుగ నెంచి ధు:కించక
సంచితములడగుచున్న'వని ఎంచి
,నిర్మలచిత్తముతోడి సాగిపోజొచ్చె
జనావాసములందలి హీనులుత్తములు,
జ్ఞానులు,షండులు,వికలాంగులు
లాన్గూలములు సైతమతనిని కొక్కిరించి
గ్రిచ్చి రాయి, రప్పల గొట్టితరుము
ప్రక్రియలు సందోహంగా ప్రకటింపజొచ్చిరి.
త్రిదండమును విరచెడివారు,కొందరు,
బిక్షాపాత్రనందుమిసెడివారు,మరికొందరు,
వస్త్రమును వాలిక పీలికలొనర్చెడివారు,
అన్నమువెట్టవోయి మట్టిగలుపు వారు,
మలినముల, నెంగిలిని,అసుద్ధముల
ఒడలపై విసరెడివారు,హథవిధీ,
ఎన్ని దరిద్ర చేష్టల పీడించిరో ఆ '
శని దెవత'కో,'దరిద్రదెవత'కొ,
తెలియనోపు,కాని ఓర్చుటమాటటుంచి
వినుటకే ఒడల జలదరింపు కలుగదే.
కొందరింకను,పరిహసించిరి,
గొలుసులతో,ఫొలుసులతో కొట్టిరి
. అయినను,కదర్యుడు,వానిని,
భౌతికమనగా 'దుర్జనాదికృతమ'నీ
, దైహికమనగా 'జరాదినిమిత్తముల'నీ,
దైవికములనగ సీతోష్ణాదికష్టములని
ఎంచి, అవస్యమునుభవైక్యమని,
ఇట్టివి పరీక్షలనీ,యెరిగి, "జనులో
,దేవతలో,గ్రహములో, నచరా
చరములకు కర్తలు కాలేరు,
వారు సైతము కర్మమునకు బద్ధులు
ఆత్మయు,కాలమును,కర్మకంటనివి
సంసార పాశ అరిషడ్వర్గ సంచిత నవరంధ్ర చూషిత
,ఎకాదశ రుద్రచిద్ర,పంచభూత సమ్మిశ్రిత అశ్వినీ
ద్వయ పోషక మీ సంగ్రహ సంగ్రస్తతా దేహము
ప్రాణముతోడి మనసను 'మాయ' క్రమ్మికొన్న
'చాయ'. ప్రాణ ధారణ కైవడి జీవునకాత్మాధార మౌను
.జీవుడన ఆత్మాబేధ లీలాస్పృహ అది జడమయ్యు,
జీవికకు ప్రాణాది త్రాణమును ప్రసాదించి చైతన్య జన్యువై
తను హృద్భాషల గుణములిచ్చి బ్రతికి పుణ్య ప్రచోద బెంచ
ఆనతిచ్చి అధికారముచేసి వ్యవస్తితమౌను.
జ్ఞాన ప్రసూనమైన బుద్ధి, విచక్షిణియవును.
అయ్యది అజ్ఞాని ఐన మరల తిమిరమునబడును.
ఆయాకర్మానుభూతులే దేవ మనుష్య
తిర్యగ్జడాది బేధములు కలిగించునట.
No comments:
Post a Comment