Sunday, September 6, 2015



Thursday, 30 May 2013 at 22:34 UTC+05:30

నేను నవజాతాన్ని




నేను నవజాతాన్ని,ఎన్నో వనాలని సృష్టించాలి.
నేను మావిలో వున్నప్పుడు అన్నీ కరతలామలకాలే
. నా అవధులన్నీ అంతరాళంలో చక్కగా గోచరమయ్యాయి.
నేనిప్పుడు నవజాతాన్ని. నాచెవులు విననిస్తున్నా
కాళ్ళూ చేతులూ కదుల్తున్నా విచిత్రం కదలలేకున్నానే.
నే చూసిన వెలుగుకూ నేటి చూపుకూ పొంతన లేదే.
కాని ఇదీ వెలుగే,కరిగిపోతోంది. నాకళ్ళు మూతలుపడిపోతున్నాయి.
మళ్ళీ ఆలోకంలోకెళ్ళి పూల మేడలూ, పాలవెల్లులూ ఆత్మానంద సొగసులూ,
అనుభవిస్తూనే, వున్నట్టుండి వున్మత్తతలోకొస్తున్నాను.
ఆవురని అరుస్తున్నాను. నాలోకము మాలోకమైనది.
ఇక్కడ నా ఆకలి, అవస్త నాకాళ్ళకు కొత్త వుచ్చులూ చిక్కులైనాయి
.కళ్ళమూతలని నిద్రంటారు వీళ్ళు. అదే బాగుంది మరి నే నవజాతాన్నిగా!
నా స్పృహ తెగిన మోదకమై తెలియని స్పర్సలొ జోగుతోంది!
నా లక్ష్యాన్ని లక్షణాలుగా మార్చేస్తున్నదెవరో,
నా తల్లి తంద్రులట విచిత్రం నే కోరినదిదేనా?
నే తెచ్చుకున్న జ్ఞాన మాకలి స్పర్సలతో దేహాను భూతిలో అనుకోకున్నా
తడిసి ముద్దై ముద్దుల మన్ననలో విలంబితమై,శిశువూ గా చేసేసింది.
నేనవజాతాన్నె, కాని చిన్ననైపోయా. ఈ శరీరపు తిత్తిలో వత్తినైపోయా.ఇప్పుడు
పెద్దవ్వాలిట,మమ జీవన హేతువాన్ అని అమ్మని నాన్నని  తెలియాలిట.
అనుకోలేదు సుమా, ఆత్మా నీ ప్రబోధము స్తబ్దమయిపోతుందనీ,
నీ వునికి నాకగమ్య గోచరమనీ మళ్ళీ నిన్ను స్పర్శిచాలంటే
పంచ భూతాలనీ,అరిషడ్ వర్గాలనీ,మనస్సునీ
నా నవజాత శరీరంతో అధిగమించాలనీ, జన్యువుగా
మన్యువుగా అనంత ఖేదాలనీ అధిగమించాలనీ,
అప్పుడప్పుడు కల్లో నువ్వు చెప్తోనే వుంటావు. కాని,
నసించిపోయె ఈ శరీరము ఎప్పుడూ నవ జాతమే.
క్షణం చస్తూ,క్షణం పుడుతూ నా దేహ కణజాలం
నా లక్ష్యము జీవించడమనీ మనసు కోరేవే తనువుకు ధారకమనీ
నా జాతకాన్ని జాతస్యహి ధ్రువో మరణమని
బతికుండంగానే సుఖపడమనీ సుఖమంటే
శరీరానికి బాగా తెలుసని క్షణక్షణమూ ఘోషిల్లుతూ
నన్ను తను గా తనువుగా ఎమార్చి మార్చేసాయి.
అయినా కల్లో జ్ఞానాన్ని పొంది నేనింకా నవజాతాన్నె అనుకుంటా.!

No comments:

Post a Comment