Monday, September 7, 2015

Wednesday, 11 September 2013 at 21:55 UTC+05:30

నేను గుంపులో గోవిందాన్ని.





నేను గుంపులో గోవిందాన్ని.
ఒంటరప్పుడు పెద్ద చప్పుడు చెయ్యను
. అప్పుడప్పుడు వరదొచ్చినప్పుడు,
బాజాలతో వూరేగింపైనప్పుడు,
అవి మరమరాల బాజాలైనా,
జండా పంజావీధిలో బండెక్కి తుళ్ళాడే
నల్లమందు సందు నయనతారలవైనా
నేనందులోదూరిపోతా,కేరింతలు కొడతా
. గుంపుంటేచాలు,నే వున్నట్లే.
వూరేదైనా,పేరేదైనా వుద్యమమైనా
నా వుద్యోగము గుంపు కలాపమే.
నన్ను ఆంగ్లంలో లంపెన్ ఎలిమెంటంటారు
. నేను పరాసు విప్లవమప్పుడూ,
అమైరికా విప్లవమప్పుడూ,
సహాయనిరాకరణమప్పుడూ,
గుంపులోనే వున్నాను,గుంపు
చెదిరినప్పుడు పోలీసుకి సలాంకొట్టి,
ఇంటిదారి పడతాను. ఆమధ్య
కేదారిలో గంగమ్మ జాతరలో
పోయాననుకున్నా కాని
గోదావరిలో తేలీ ప్రస్తుతము
సీమలో గళ గళానశంఖారావం చేస్తున్నా.
నన్ను పట్టించుకుంటే కొంచం
విశ్రాంతి తీసుకుంటా లేపోతే
చీకటంటే నాకు భయం,చిక్కిపోతాను
. నాటో పాటు ఇంకా చాలా
గోవిందాలున్నాయి. వాటికీ నాకూ
ఆకలొక్కటే దాహమొక్కటే.
గొడవలు వేరైనా,వారూ వీరూ
తేడా నాకుండదు. నన్ను లెక్క చేస్తే
రెచ్చిపోతా,అక్కరకు రాని చుట్టాన్ని,
మరి. నామానాన్న నన్నొదిలేస్తే
మరమరాలేరుకుంటా, సలాము చేసి
సందులోకి జారుకుంటా, నేనే
గుంపులో గోవిందాన్ని, టైమవుతోంది
 బాజాలొస్తున్నాయి వుంటామరి.

No comments:

Post a Comment