Tuesday, September 8, 2015

Friday, 13 June 2014 at 12:14 UTC+05:30

తడవు లేక విసువులేక పరువులెత్తి




తడవు లేక విసువులేక పరువులెత్తి
ఇసుకవిదుపు వుడత తినగ నెంచదు,
అనగ నాగదు,రామ రామ యని
పరువులెత్తు సేతువు తానె కట్టనెంచు
,ఇబ్బడిముబ్బడిగ ఇసుకరాల్చు, రాలసందుల
రాపిడిపుట్ట కాలత్రొక్కి చదునుజేయు.
అమ్మా వుడతమ్మ నీతమ్ములు హనుమంతాదులు
విశ్రాంతి గొనుచుండిరి ,డస్సియుంటివి
తొల్లింటినుండిశ్రమజేసి, ఆగవె,రావె,
నీదు కష్టము నాకు మిగులనెక్కువయని ఆయన
, రామయ్య,గ్రుచ్చి అరచేతుల నిమిరి మురిసిన
తరిని బ్రహ్మాది దేవగణమ్ములు "భవ్యమగుగాక
కలకాలము రామస్పర్శ కలికమౌగాక నభమ్ము
భూమి నిలుచునందాక శాశ్వతమౌగాక"
అని మిక్కిలి కొనియాడగ మందస్మిత వదనుడు
రామచంద్రుడు ప్రేమమీర కడు వాత్సల్యమున
వెన్ను నిమిరె,ఎట్టిభాగ్యమో వుడుతమ్మ నీది
రావె,మా తల్లి బుల్లి మురిసి నీతోడ నాడగ.

No comments:

Post a Comment