Thursday, September 10, 2015

నవ్వుతాలు కాదు నిఝముగానే







నవ్వుతాలు కాదు నిఝముగానే నాకు
తెలిసి తాగినప్పుడు నవ్వూ ఏడుపూ
కోపం శాంతం, నాలుక్కొళ్ళ మంచంపైకెక్కేస్తాయ్
తాగుబోతెప్పుడూ ఘాడంగా ఫీల్ అవుతాడు
అంతేకాదు ధ్రుఢంగా మిధ్యని నమ్ముతాడు
నవ్వేవాడు నవ్వుతూనే వుంటాడు
అల్లానే ఏడ్చేవాడేస్తూనే వుంటాడు
పరిష్కారాలు తొందరగా తొందరగాతోస్తాయ్
పరిస్తితులెప్పుడూ అడ్డాలుకావు ముందు
మందుతోడైతే ఎంతమందైనా బలాదూరే
సభ్యతా సమాజమూ మిధ్యా వస్తువులే అతగాడికి

No comments:

Post a Comment