మీరు కనిపించారేమిటీ?
కల్లో రాముడో,మరో దేముడో కనపడాలని
కళ్ళుమూసుకు మనసులో కన్నా వెంకన్నా
అనుకుంటూ పండుకుంటే అయ్యో నాకు
నేనే కనిపించాను. వూక దంచుతూ వుపన్యాసమిస్తూ
గుళ్ళోనో,బళ్ళోనో గణ గణ బెల్లయ్యింది
అందర్నీ దాటుకుంటూ హాస్టలు వైపు
పరుగులో చూసుకోలే పంచె జారిపోయింది.
కొంచెము దూరం వెళ్ళిన తరువాత
అటూ ఇటూ పరిగెత్తే పిల్లలమధ్య
అయ్యోనాపంచేదర్రా అని మొత్తుకున్నా.
ఎంతవెతికినా దొరకకపోతే అక్కడున్న
చుక్కలవోనీ చుట్టుకున్నా ఎంతబాగుందో
నీలి పూల పచ్చ పావడా
అమ్మాయిలూ అబ్బాయిలూ చూస్తారేమో
అని ఆట పట్టించి పాఠం వినరనీ బెంగపడుతూ
పరుగులాంటి నడకతో పంచె వెతుక్కుంటున్నాను.
అమ్మ కనిపించి అదేమిట్రా పంచె భుజమ్మీదేసుకు
పావడా కట్టుకున్నావని అడిగింది. బలే అమ్మా
ఎంతవెతుక్కున్నాను,జారి పోయిన చీర
భుజానికెత్తుకుని దారి లోనిదె అని
నడుముకు చుట్టుకున్నానంతే, అమ్మా
చిన్నప్పుడు ముల్లు తొక్కానమ్మా
అన్నప్పుడు ఎందుకు తొక్కావని నవ్వావుగా!
అల్లానే నవ్వుతున్నావిప్పుడుకూడా.
ఎమీ మారలేదమ్మా మీరు.అయినా
నేను దేముడిని చూద్దమనుకున్నాను.
మీరు కనిపించారేమిటీ?
No comments:
Post a Comment