గడచిన నా బతుకంతా..............
గడచిన నా బతుకంతా జరిగిన
కలగా లీలగా అలికిడికి
చెదిరిన మెలుకువలో
ఆకాశపువొడిలో విడివడిన
మబ్బుపింజల్లాగా తడిసిన
కాగితంలోంచి తొంగిచూస్తున్న
నా కయితల సమాకలనమే.
నాకైతే నాకలల గారాబురూపం
ఒక గొప్ప కలే,కానీ కలకదా
సౌదామినీ,కాదంబరీ,
కలలో కధలోకొచ్చేవారు,
పాత్రలునావే అనుకున్నప్పుడు
పాలుపంచుకోబోతే కృత్యాభూతం
జడలిప్పి కళ్ళకి చీకటి
కలికం పూసేది.జరా భూతం
వంటికి మాయని గాయం చేసేది
,ఇంకెక్కడి కలల సౌధం
మెలకువలో మతి తెలియని పరుగు
. నిద్దుర మొద్దుదైనా బాగుండేది,
నిస్సిగ్గరి మనసుకు బిడియమేదీ!
. కలా నిజమూ,దొర్లుకుంటూ,
పగలూ,రాత్రీ గణించక
పూలూ,ముళ్ళూ నేలా,బురదా
వివరంలేకుండా పరిగెట్టేశా.
ఇక ముళ్ళుగుచ్చుకునా నొప్పి తెలీదు.
గులాబీల పరిమళమూ పట్టివ్వదు.
వ్యవస్తే లేపోతే అవస్తేముంటుంది.
ఐనా మనసు మాత్రం వాడలేదని
ఆత్మసాగత్యంలో అనంతమౌతాననీ
ఆనందార్ణవమౌదామని కలగంటోంది
No comments:
Post a Comment