Thursday, September 10, 2015

Tuesday, 7 July 2015 at 09:03 UTC+05:30
.

నీవాస్రిత ధర్మమునెంచునది




లేరు చెలికాండ్రు,చుట్టములు,వెలివేతన
బడె మన బోయ మిక్కిలి భయము
కలిగించెడివాడగుటంజేసి తన మంచినెరుగడు,
హింసయన భీతిచెందడు,కనవచ్చు జలము
నెండమావియందు కనగ రామితనియందు దయ
బోయ తీరు నరయగ నేర్తుము మనము

''కోరగరాదు నెత్తుటి కూడు
చేరగరాదు పాపిష్టుల నీడన
నేర్వగరాదు క్రూరఖర్మల
చూడగరాదు చెడుగు కలనైన

చెరుపు'టాలోచన 'చెరుపు'కంటె దుష్టము
తెలియకజేసెడి హింస సహింపతగును
కొండకచో హితవున మానప వచ్చునట్టిహింస
తెలిసిజేసెడు దుష్టకర్మకు ప్రాయశ్చిత్తములేదు
మనబోయ పొట్టకు పిట్టలకొట్టెడివాడు
పీకిన రెక్కల నవి ఎగురలేక ఈకల దువ్వుదమని
ముక్కు నరయగ నవికాన రాక పిక్క టిల్లెడి
పిట్టల గతి జూచి విక విక నగెడి వాడు
నిండు జీవముల కొంకెకి గ్రుచ్చిపిండుకు
ఏడ్చెడు పిట్టల పీకల నొక్కెడి వాడు
దైవ యోగమున వివేకమెరుగక
వేరొక బ్రతుకెంచక పెండ్లాము తనబిడ్డలు తప్ప
బంధుత్వమెంచక బోయ గొప్పకాలము గడపె,
నంత నొకనాడు వేటన పెనుగాలిన చిక్కె
అట్టి తరి ఆకసము ఫెళార్భటుల మిక్కిలి చీకటయ్యె,
పెనుపాతమున చిక్కటి చినుకుల దిక్కులు తడసె
అడవి వరదై అన్ను మిన్నులేకమాయె
జీవములు దక్క వేట నీటిపాలాయె
గడ గడ వడకుచు బోయ జేరె
గొప్ప తరువు బొందన భీతుడై
కష్టకాలమున కలివిడెక్కుడగుటంజేసి
అడవి బడుగులు తోడుతప్పి ఆపద
గడువ గడబిడలు మరచి చెలిమిని బరగినవి
రాతుడు నిలువలేడు నిక్కముగ బారలేడు
చలికి గడ గడ వడకుచు తేరి జూచె బారను
దారేమైన గలదేమొ నెంచ,కాని కనుగొని
రెక్కలు నుగ్గైన గువ్వనొకదాని
ఎత్తి బుట్టన వైచి నిజనైజము విడువక
తన ధుఖ:మునెరిగియు తను తనువులు
డస్సిన కపోతి కష్టమెంచడయ్యె కిరాతుడు
అట్టితరిని ఆబోయి తలయెత్తి చూచె
తన కాపదయందు నెలవైన తరువును
చాల విశాల,శుక పికముల,బక శాబకముల
కాలవాల మైనట్టి దది కొమ్మల
చీకటిమబ్బులావరించినదై
జాతి తెలియరాదాయ పెనవైచిన
పారాడెడు పాములవలె వ్రేళ్ళున్నట్టిది
చీకటిన పెనుచీకటులై,భూతములె
తూగుచున్నటుల భ్రమలు గొల్పు
ఫలిత శాఖలజూచి వికలచిత్తుడాయె.
వాన వెలిసిన పగిది అడవియొప్పె
నిలచిన జలమున తూగెడి నీడల
 తేలెడి మణులవలె తోచె తారలు
ఆకశమున మిణుకుమిణుకు తారలు
నిలచిన నీటిన తళుకు దివ్వెలు
అహా! ఎంతటి అందమైనది అడవి తల్లి
భయము విహ్వలత,నయము విస్మయముల
తోడుకొని  నిస్చేష్టల కాలవాల మైనది కద 
 అట్టితరి మనబోయ చెట్టును జూచి 'ఒహో
వృక్ష దేవతా,దోసిలొగ్గిమ్రొక్కెద
ఇట్టిచిక్కు నిప్పటివర కెరుగను,
దయన ప్రాణముల రక్షింపగదే'యని\

వ్యాధుడు నిలువలేడు విధిని తలచి వగచును,
తన్ను తాను మరచి ఏడ్చును
దాపులనున్న కొమ్మపైనొక కపోతుడు
దీనాలాపముల తన పెంటిని తలచి
పెక్కు విధముల విచారించుచు
ఎగిరి తిరిగి నిలుచు నిలిచి తిరిగి ఎగురు
రెక్కలార్చును,మెడనిక్కి చూచును
బోయనికని మది భయము చెందును
ధైర్యము చేసియు భయము విడువడు
వ్యాధుడు తిండిలేక భయము చెందివాడు
మిక్కిలి ధుఖించి అలసిసొలసి నిదురపోయెను
అదిగాంచి,కపోతుడిట్లువిలపించె
అహా నా పెంటి ఈ ఉపద్రవమున ఎమైనదో
ఒక వంక చెలికాండ్రందరు గీముల చేరిరి
ఆకశము నిర్మలమైనది, చుక్కలు దారి
చూపునే ఇంకను నా ఇంటిది రాకున్నదే
ఏమైన అపాయమున చిక్కినదో భీరువుకాదే,
వానన సుడివడినదో నా ప్రియ లేక
ఇల్లు సూన్యమైనదే పరివారములెల్లరున్నను
పెండ్లాము లేక పరిమార్చన జరగదే ఆత్మలేక
ఇల్లన ఇల్లాలేకద,ఆపెలేక బ్రతుకేలేదు
ఆపె సువ్రత,తినక తినదు, కనక కన్ను తెరువదు,
నీరాడదు కనగలనె పరుల ఈ కండ్లనునే నా
యాత్మవిడచి దేహమున మనగలనే
ఆమె తపస్విని,నా హృదయ లయ స్తిరమైన
మనస్వి,కీర్తిశాలిని తలితండ్రుల కలజీవనసాఫల్య
ఆమెయె నాకౌషదముభోగము సమస్తము
ఆమె లేక నా ఇల్లు వల్లకాటితో సమము

పిట్టలపొట్టనబెట్టుకొను కిరాతుని బుట్టన
చిక్కిన పెంటి వున్నవోలేవొ, నే లేక వున్నట్టుల
చిన్నవైనవి చిద్ర హృదయమున చింతన
గొప్పగ యొప్పినవిగదా నాకటికి వేదనకి
మాదొక్కటిజీవము నాపతికి నేనెట్టిది
చేసిన గొప్పగనొప్పును,వంటరితనమెంతటివేదన
హృదయములొక్కటైన బ్రతుకులు విరహమున
అహరహరము మనజాలవు అగ్ని సాక్షి నా పతి
పరదైవముకద అనితలపోసి యాపె భర్తకిట్లనె

నాపతీ,హితవొక్కటినే పలికెద ఆలింపుము
,శరణాగతిని పాలించుము కిరాతుడు
నీ ఇంటిముంగలపడియున్నాడు విదారక
మీ స్తితి చుట్టుముట్టిన వీతనిని ఆకటి
చలి కడబట్టినవీతని ప్రాణములు
ద్విజుని,గోవును,తల్లిని,శరణన్నవానిని
కావవలె దైవములవలె నెంచగవలె అనన్య
శరణ్యుడీతడు, మన్నించుము మనము
కాపోతులము,అన ఆహారములము
మనధర్మమితరుల కన్నమగుటయె ఎంచినా
కడుంగడు సంసారులము,కామము తుఛ్ఛము
బ్రతికి చచ్చుటకంటె సాధకతన తనువిచ్చుటె
పరమధర్మము కద తొల్లిట తల్లి గురువు,
తండ్రి దైవము పిదప సంసారము దైవసమాగమ
సేవ జీవనసాఫల్యమన వేరొంటిదికాదు
శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం
పరోపకారం ఇదం శరీరమందురు కదా!
పిల్లలు కొడుకులు నీ రూపమున
నున్నవారలు పుణ్య సమయమిది,
నీవాస్రిత ధర్మము నెంచుము

No comments:

Post a Comment