Wednesday, September 9, 2015



తెలిసీ తెలియని



ednesday, 10 September 2014 at 22:32 UTC+05:30

తెలిసీ తెలియని మనసుకి వికసించేబుద్ధి నేస్తం.
బుద్ధిజీవుల జ్ఞాన వికాసానికి ఆత్మ పరిమళము.
పాపపుణ్యగణ్యమే గర్భావాసఫలము .
సంచితపుణ్యలేశమే సద్గర్భజన్యకారకము.
తొమ్మిదినెలలవైరాగ్యజీవనమేసంచితఖర్మక్షాళనము
నవమాస సమాధిలో మనసంతా జ్ఞానమే
బొడ్డుతెగేసరికి బుద్ధి మనసూ విడివడగా
అరిషడ్వర్గాలు అహంకారమూ మనసుకు వశమూ
కించిదాత్మ బ్రహ్మానందంలో నిక్షిప్తమే.
మరి బుద్ధి వీతరాగభయక్రోధాది కోపతాప
శ్రవణ స్పర్శా వాగ్రూపక విచార హేతువై ప్రవర్తిల్లదె
. పుట్టిన ప్రతిశిశువూ నవజాత పారిజాతమే.
శైశవదశలో తల్లి స్తన్యమే అమృతజీవకము.
కౌమారములో తండ్రి పంచిపెంచినతీరే జ్ఞానాధారము.
మమత నేర్పేది--మనసుపెరిగేది
! అమ్మ మమత,నాన్న మాన్యత!
అమ్మ తండ్రి ఆత్మీయతా తోరణము!
తాత తండ్రి ఆత్మ దీపము !
అమ్మమ్మ ముచ్చట్లు అరిశలు బొబ్బట్లు.
నాయనమ్మ కధలు, పాటలు, మాటలు
వెన్నెట్లో జోలాలీ వూసులు పుత్తడిబొమ్మ పూర్ణమ్మకు
జేజలిచ్చిన వేయి వన్నెలు.లాలిపాటలు
మనసుకు మంచి గంధపు నలుగు,
మాయ మర్మమిప్పెడు తెలివి మనసుకు కలుగు
! రాధ మాయ, క్రిష్ణుడు భాగవత తృష్ణ!
నిషి వైతరిణీ గమన కాముకుడు!
మనసు దేహాన్వయము,
భక్తి పరమ భాగవత శక్తి!
సకలజీవక ధారక పోషక దీప్తి.!! r

Wednesday, 10 September 2014 at 22:07 UTC+05:30


No comments:

Post a Comment