Wednesday, September 9, 2015

గమనములో గోచరమేనా?





గమనములో గోచరమేనా?
హ్రస్వమో దీరఘమో చూపై
నీడల్లో నడయాడుతున్నావా
వామనుడు మన పూర్వీకుడే!
కాశ్యపుని కామితము కాలాతీతమైనా
కొలమానమే, మూడడుగుల బుడతడు
మూడోకంటికి దొరకనివాడు,
మనకీ కొంచం పంచాడు, కొసరుండని
కోరికనే కానైతే నీలోనీకే దొరికేనూ
లోపలికంటూ చూసే మూడో కంటిని
కనుగొంటే. పాలిచ్చిన అమ్మని అడుగూ,
గురువుకు గురుతైన నీకు
నీడైన తండ్రిని అడుగూ
మూడో కన్నంటే ఏమిటనీ
మనసులో వెలిగేదేమనీ
కలిగే బుద్దికి బలమేదనీ'?

Friday, 12 September 2014 at 13:12 UTC+05:30

సమాజము మరీ సమమేమీ కాదు
, అప్పుడప్పుడు అజమూ అజాగళ స్తనమూ,
ఏమీ ఏమైనా సందేహమా? దేహాన్ని కాదు
మనసునడుగు చెబుతుంది. కళ్ళులేని
చెవులున్న సమాజము జడమేమీకాదు.
\ కూడరాని స్తితి తోడైనప్పుడు దాని వాగుడు
కడలు గడచిన కడలై కడుపు చెరువు చేస్తుంది
తల్లీ నీ గర్భమెప్పుడూ శోకముతో ఆర్ద్రమే,
. ఆ రుద్రుడికి కూడా అర్ధంకాదు
తల్లి ప్రేమాస్వరూపము
పాపమతడూ ప్రేమోపహతుడే
. తాపపు కోపములో వసంతము
ఆసాంతము అల్లాడిపోయింది
. సృష్టి నివ్వెరపోయింది.!
ప్రేమైక్యమూ ఆత్మైక్యమూ ఒక్కటే!
అనుభవమే కాదు అనుశృతికూడా

Friday, 12 September 2014 at 12:54 UTC+05:30

భవమంటే వున్నదేగా
అనుభవమంటే అందరిదీ కాదు
తద్భవము మనసుభాషైతే,
ప్రేమించిన వారికే తెలుస్తుంది
మూగ భాష పెంచినవారూ
ప్రేమించిన వారే, అయినా,
వండివార్చినది తిండైతే
పెంచి పోషించేది మమకారము
అల్లారుముద్దు మనసుకి జోలపాడితే
మమకారమ తిశయిస్తే అపకారమే
తనువులో తన్వికి
నిలవరించే విశ్వాసము నిస్తేజమైతే
ఆత్మీయ ప్రేమా నీ వునికి చులకనేసుమా.!!

No comments:

Post a Comment