Tuesday, September 8, 2015

Friday, 13 June 2014 at 11:40 UTC+05:30

శుభం భూయాత్.




వర్తమానములో మనోవైకాల్పనికత
వస్తువుని ప్రసవిస్తే భవిష్యత్తులో
బట్టకట్టి నేను నిజరూప చిత్రమౌతుంది
. చిత్రమే! పింద వంటి వూహ అందలమైపోవడము.
ధ్యాసా వూర్పూ జీవనమనుకుంటే
వూహే బ్రతుకనుకోవడము మైకమే.
మనసు క్షుద్పిపాసలని తృణీకరించైనా
వూహలోనే జీవించడము మోహమే.
మోహాంతర్గత బిందువు అర్పణమో,కార్పణ్యమో
ఏదైతేనేమీ ఆశలవలయానికి ఆధారమే.
ఆశ పిరికిది,గిరికీలుకొట్టించే జీవవలయంలో
దాహక కామ్యాల్లోకి తొంగించూసే
మురికి మనసుకు నేస్తమే.
వర్తమానములో శరీరిని వేరుచేసి చూడు
వర్తమానమందుతుంది, శాస్వతమైనది వేరనీ,
ధుఖాన్ని వేదననీ కరగించేది పరవిషయమనీ,
మోదకమైనదీ,మనస్సులోనే పరిమళించాలనీ,
ఆ పరిమళాన్ని ప్రోవుచేయాలంటే,
మనసు రంధ్రాన్వేషణమానాలనీ
ఆప్రయత్నములో పరమశేషత్వాన్ని ఎంచాలనీ
ఇప్పటికెత్తిన జన్మలు చాలనీ,
మాయని ఛేదించాలనీ, మనోవాంఛలేమాయని
తెలియాలనీ పరమపదమే జీవనసాఫల్యమనీ
ఎదోఒక సమయంలో మనోనేత్రము విప్పర్చుకు
నీకు సత్యము బోధపడుతుంది.
పురాణాలని చరిత్రలాచదువు.
చరిత్రలో పాత్రవి మాత్రం కాకు.
ఎందుకంటే పాత్ర జీర్ణమౌతుంది,
మళ్ళీ పాత్రలు మారాల్సొస్తుంది.
అపాత్రమూ ఎంచేప్రమాదముంటుంది
. ష్రుష్టి ప్రక్రియలో తన్మూలమైపోకు.
మూలము మనసనీ ఎంచి
తన్మూలాన్ని ఛెదించు.
శుభం భూయాత్. మిత్రమా నీయాత్రకి.

No comments:

Post a Comment