Tuesday, September 8, 2015

 ప్రకృతి మృత్తికలతో,

తరులతాగుల్మములతో,
బండరాళ్ళ కొండగుట్టలతో,
నదీనదప్రవాహికలతో
అన్వేక జీవజంతు వైవిధ్యముతో
క్రిమికీటక,సరీసృప,క్షీరద అండజ,
చర అచర పక్షి సమాహారము
. తనదైన ఒడిలోమనమూ,
తృణమూ,పణమూనూ,
కాదంటే,బుద్దిజీవులము.
ఔనా? కాని మన విచక్షణ జ్ఞానమూ మనము ప్రకృతి పరిశీలనలో వినియోగించకుండా తన తౌల్యతనీ భంధనా ప్రవ్రుత్తిని తెలిసో తెలియకో పరిహసిస్తే పర్యావసానాము చాలా భయంకరముగాను, మనము ఎంచి భరిచలేనిదిగానూ వుంటుంది. ప్రాచీనులు ఈ విషయాన్ని గుర్తించి, కీలకమైన ప్రకృతి సుడులనీ ముడి పీటలనీ,నిమ్నోన్నతాలనీ,పర్వతసానువులగర్భాలనీ,కేంద్ర స్థానాలనీ, భూమి నాడీ వ్యవస్థనీ,నాభీ స్తానాలనీ,గుర్తించి,వాటికి గౌరవ బలీయ పాటవతనీ, దాటరాని విధి విన్యాసాలనీ కల్పించి,పరంపరానుగతముగా అవి మన్నించబడడానికి పూజోపచారకృత్యాలనీ నిర్దేసించి వాటి అవలంబనా పాలనాదికాలను నిర్దుష్టముగా రచించారు. పృఅళయానికి తెలిసిన తెలియని కారణాలనేకము వుంటాయి. సోధించి పరిశీలించి మాత్రమే తెలుసుకోగలము. ఒక విస్వాసాన్ని కాదు అని ఔను అనే అర్హత శాస్త్రీయ నిరూపణ ద్వారానే సాధ్యము. మూఢ నమ్మకమని కొట్టి పారెయ్యలేము.

No comments:

Post a Comment