.సందేహమెందుకు మేము అన్నదమ్ములమే / వచ్చో కూడదోమరి నా కల పర్యంతము
సందేహమెందుకు మేము అన్నదమ్ములమే
కానైతే పంపకాలెట్లా,? తాతతండ్రుల్నీ,
అవ్వమ్మల్నీ కూడా వారితోబాటు పారే యేరుల్నీ
, కదిలే ఱుతువుల్నీ, గాలినీ,వ్యాప్తమయ్యే తరంగాలనీ
అన్నింటినీ సమన్యాంగానే అని అనుకున్నాము
. అందుకనే వలసలాపండి పక్షుల్లారా,
పారే యెరుల్లారా కొంచమాగండి నీళ్ళుకొల్చుకోవాలి,
గాలీ వీచకు వీచినా నీఇస్టానికి మేఘాల్ని తరమకు,
మాకు లెక్ఖలు తేలాలి, మేమన్నదమ్ములము పంపకాలలోవున్నాము.
ఎక్కడివారక్కడే గుప్చిప్, సాయిబూ నీ అత్తరిక్కడే అమ్ముకొ
, మంగలీ నీవక్కడివాడివా అయితే ఫో పొది సద్దుకు తొలగిపో.
రాళ్ళుకొట్టే వాళ్ళూ మీ వూఋలకు పోండి కొండల్లేకపోతే గోతుల్తవ్వుకోండి,
చీపుళ్ళవాళ్ళూ బయళ్ళల్లోనే బతకండి,కానీ ఇటూ అటూ తిరగకండి
హద్దు దాటితే పల్లూడకొట్టుకొని పన్ను కట్టాలి
మనుషుల్లారా మీ వూర్లల్లోనే చావండి మాస్మశానాలు మశానం చెయ్యోద్దు
. భూతాల్లారా ఎక్కడివాళ్ళక్కడ సుమా తేడాలొస్టే తాట వలుస్తారు,
అన్నట్లు దేముళ్ళూ పరాక్ మతి తప్పి సంచారము చేస్తే గాచారం మారిపోయేను
. మావూరి వెంకన్న రైల్లో మీవూరివారికి తిక్కట్లుండవ్ సరేనా,
వుమ్మడి మంచాలు నరకాల్సిందే, కంచాలూ పంచాలి.
అడ్డమైనా నిలువైనా మావి మావే మీవి మీకే. పెద్దమన్షులున్నారు
, గీతవతల చస్తే మీరే పూడ్చాలి. హద్దు దాటిన మృగాల్నీ, పక్షుల్నీ వదిలేదిలేదు.
రాత కోతలయి పోయాయి, కళ్ళులేనివాళ్ళలారా చూడండి,
చెవిటి చవటల్లారా వినండి మీకోసం మేమేంచేశామో
అన వచ్చో కూడదోమరి నా కల పర్యంతము
అనపర్తిలో అలనాటి చెలిమి ఆద్యంతము.
రైలు దిగినప్పటినుండి ఇల్లుచేరే దాకా లెక్కే,
అడుగులు మరి శంకర్ కేఫ్ చేరేటప్పటికి పరుగే,
మనసు ముందే చేరేది, వాకిట్లో చిరునవ్వుల తోరణాలు
సాలి వాండ్ల నూలి మంచాలు చంద్రునికోపోగన్నట్లు
దారంతా పరచుకు మరియాద చేసేవి.బాబూ రావోయి,
అని చిరునవ్వుల తెరచాప విప్పి సీతక్కా,
పెద్దాపురం బావొచ్చాడోయని పిల్లలూ,
అల్లరి పండగ చేసేవారు. మొహమ్మీద కాసంత చుట్టకాల్పూ,
బహుశా దామెర్ల రామారావుకి తనే ఇన్స్పిరేషనేమో అన్నట్లు
మర్యాదరామన్న ఫోజూ, ఆయనే మాబావ,
మరి పడక్కుర్చీ,కాళ్ళుబారజాపుకున్న బావా,
మన బాపు చారికేచర్ ఆర్ట్ అనిపించే వాడు..
. మరి కాలం మారిపోయింది, నలభై ఏడేళ్ళ క్రితం
మాట కదా, అయినా డాక్టొర్ జగన్నాధం బావ గారి వీధి
ఆవిడెవరో పెద్దత్తయ్యగారి మేడా, స్టేషన్ పక్కనే అల్లాగే వున్నాయి,
ధర్మారెడ్డీ వాళ్ళ వీధి, ముందుకు కాలవా ఆపైన వంతేనా
ఎమీ మారలేదు అనపర్తి గుర్తుల్ని కల ఎంతబాగాదిద్దిందీ!
మధురమే అయినా మనసంతా చిన్నబోయింది
,బావనీ,సీతక్కనీ, పిల్లల్నీ తలచుకుని.
No comments:
Post a Comment