.
.
.
మనసు గోదారి నా మాట చెలిమి
పాట నా బాట మరియాద నా చూపు
భద్రకాళి పాదాల పారాడు తలవంచి
తమ్ముడా నోరు తూలకు మనది కాదా భాష
మనది కాదు దేవదాసీగణము. మన గుణము
అమ్మతల్లి తోడు ఆడుబిద్ద కాపాడు,
అడవి తల్లి తోడు సమ్మలక్క
తోడుసారలక్కతోడు చెడ్డ మాటలొద్దు
, బిడ్డ నోటికి చేటు. అమ్మ కడుపు చల్లగ
తేజస్సు ఓజస్సు,జాగృతి ఒక్కటై మన
మాట,చేత .మనసు ఒక్కటై పేద,పెద్ద
కులము,గుణము ఒక్కటై పోరాడుదాము,
ఒక్క కంచాన తిందాము ఒక్క ప్రాణాన వుందాము
, కులట సంభాషణలు కుళ్ళుగంధమైన తిట్లు
మానినుల మాన ప్రాణ అవమాన భాషలొద్దు
. కులగారవ నీరవ కీర్తిమనది. రాముడేలిన సీమ
,సీతమ్మ నిలచిన నందన కానన మిది
,చిత్రకూట, త్రిలింగ దేశమిది తెలిగోద వారాసి,
మనపాలిజాహ్నవి, తెలుగోడ తెలింగాణము
కళింగాంధ్ర వరకన్న. మీరకన్న మాట,
జారకన్న నోరు. అమ్మ భద్రకాళి వూరకుండదూర్లలో.
అన్న భీమన్న పోతన్న జంపన్న మా యన్న
మీ యన్న మన మన్న మాట ఒకటన్న
No comments:
Post a Comment