కదర్యుడు మూడవ అంశము.
ఎవ్వరు కారు కర్తలు నా క్లేశ సరళికి
సంచిత కర్మ పాశ మనము దక్క
సంసార చక్రమును దిప్పునది
ఆరువారంబుల కోరికలనెడి
ఆభరణములు ధరించినదియు
పంచభూతముల పంపున
ఆకటికి వాక్కాయ కర్మములకు
రాజయి రాత్రిబవళ్ళ సశరీర వాంచా
సుమనోజ్ఞ జ్ఞాదీపికా ద్వయమున
చీకటి వెలుగుల నూయలలూగి
అవనతమో పతనమో చెంది చిక్కి
చివరకు బొంది విడుచును గద
అట్టి మనము గాక మరి యేది
పెక్కుడు మాయలంబడునది
మిక్కిలి రోసి ఆత్మయందు
సాగిల పడి మ్రోక్కెడిది.
జ్ఞానము హిరణ్మయము పరమాత్మ క్రియా శీలకము
శోధించిన మనమునకు సాక్షాత్కరించు నతడు,
సాక్షీభూతముగ,సర్వ కార్య కర్మములందును
, స్వతంత్రమిచ్చియు తాను, జ్ఞాన రూపమున
బుద్ధికి అనన్య విచక్షణాదికము నిచ్చు
No comments:
Post a Comment