వనములన్నీ చేతనములే.
.
వనములన్నీ చేతనములే.
చేతన తళుకులీనే ప్రమాదావనములో
వంటిలోనూ,మంటిలోనూ
ప్రకృతి పూచేవేళ ప్రమదా, జాగ్రత, జాగ్రత!
పరిమళంతో బాటు ప్రాణాల్ని ఆశించేవాళ్ళూ
ఆశనే ప్రేమగా నమ్మించే వాళ్ళూ
వేళ్ళల్లో కుళ్ళు మాటల్లో పరిమళమున్న వాళ్ళూ
తీయనిదే ప్రేమనే మాయగాళ్ళూ
దారికాచి దోచుకోనున్నారు.
బృందావనానికి దారిదనీ
ఆనందార్ణవానికి వునికిదనీ
సద్యోచేతనా గోముఖ ప్రవృత్తితో
వనసంచారము చేస్తున్న పులులు
పులుగులూ,నక్కలూ,తోడేళ్ళూ
పొంచి వున్నాయి. మన సమాజము
కీకారణ్యమే. భవనాలూ,స్మశానాలూ
పక్క పక్కనే వున్నాయి సుమా!
ప్రమదా జాగ్రత జాగ్రత !
కనిపించేదీ,వినిపించేదీ స్పర్సించేదీ
సమస్తమూ పధార్ధంలో పల్లవించేదేమీ
కాదు. సహనమూ,ఓర్మీ, పరిధీ గుర్తించు.
పైనా క్రిందా,ప్రక్కనా పరి శీలించు.
చీకటి చాటున, ఒంటరి బాటన
సాయము చెంతనా,ప్రేమ మాటునా
పొంచి వున్నాయి మోగని ప్రమాద
ఘంటికలు ప్రమదా జాగ్రత,జాగ్రత.!!
పరిమళంతో బాటు ప్రాణాల్ని ఆశించేవాళ్ళూ
ఆశనే ప్రేమగా నమ్మించే వాళ్ళూ
వేళ్ళల్లో కుళ్ళు మాటల్లో పరిమళమున్న వాళ్ళూ
తీయనిదే ప్రేమనే మాయగాళ్ళూ
దారికాచి దోచుకోనున్నారు.
బృందావనానికి దారిదనీ
ఆనందార్ణవానికి వునికిదనీ
సద్యోచేతనా గోముఖ ప్రవృత్తితో
వనసంచారము చేస్తున్న పులులు
పులుగులూ,నక్కలూ,తోడేళ్ళూ
పొంచి వున్నాయి. మన సమాజము
కీకారణ్యమే. భవనాలూ,స్మశానాలూ
పక్క పక్కనే వున్నాయి సుమా!
ప్రమదా జాగ్రత జాగ్రత !
కనిపించేదీ,వినిపించేదీ స్పర్సించేదీ
సమస్తమూ పధార్ధంలో పల్లవించేదేమీ
కాదు. సహనమూ,ఓర్మీ, పరిధీ గుర్తించు.
పైనా క్రిందా,ప్రక్కనా పరి శీలించు.
చీకటి చాటున, ఒంటరి బాటన
సాయము చెంతనా,ప్రేమ మాటునా
పొంచి వున్నాయి మోగని ప్రమాద
ఘంటికలు ప్రమదా జాగ్రత,జాగ్రత.!!
No comments:
Post a Comment